ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్‌ ఇదే | Sachin Tendulkar Reacts To 23 Wickets Fall On Day 1 Of The Cape Town Test | Sakshi
Sakshi News home page

IND vs SA: ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్‌ ఇదే

Published Thu, Jan 4 2024 7:25 AM | Last Updated on Thu, Jan 4 2024 8:35 AM

Sachin Tendulkar Reacts To 23 Wickets Falling In The First Day Of The Cape Town Test - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. తొలి రోజే ఆసక్తికర మలుపులు చోటు చేసుకున్నాయి. న్యూలాండ్స్‌ పిచ్‌పై ఇరు జట్ల పేసర్లు నిప్పులు చేరిగారు. ఫలితంగా మొదటి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. టీమిండియా పేసర్‌ సిరాజ్‌ దాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, ముఖేస్‌ కుమార్‌ తలా రెండు వికెట్లతో తమ వంతు పాత్ర పోషించారు.

ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియాది కూడా అదే తీరు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద పటిష్ట స్ధితిలో నిలిచింది. దీంతో తొలి రోజును భారీ అధిక్యంతో భారత్‌ ముగిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్‌ చేసుకుంది. చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ అదే స్కోరు వద్ద టీమిండియా ఆలౌటైంది.

సచిన్‌ రియాక్షన్‌ ఇదే..
ఇక ఒకే రోజులో 23 వికెట్లు కోల్పోవడంపై భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "ఒకే రోజు 23 వికెట్లతో ఈ ఏడాది క్రికెట్‌ ఆరంభమైంది. ఇది ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. సౌతాఫ్రికా ఆలౌటైనప్పుడు నేను ఫ్లైట్‌ ఎక్కాను. నేను ఇంటికి వచ్చి టీవీలో చూస్తే దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్‌ చేస్తోంది. నేను ఆశ్చర్యపోయాను. ఈ గ్యాప్‌లో నేను ఏమి మిస్సయ్యాను?" అని సచిన్‌ ఎక్స్‌( ట్వీట్‌) చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement