కంగ్రాట్స్‌ టీమిండియా.. అతడు మాత్రం భయపెట్టాడు! బుమ్రా కూడా: సచిన్‌ | IND Vs SA: Sachin Tendulkar Praises Jasprit Bumrah Performance Followin India's Historic Win In Cape Town - Sakshi
Sakshi News home page

Sachin Tendulkar Praises Bumrah: కంగ్రాట్స్‌ టీమిండియా.. అతడు మాత్రం భయపెట్టాడు! బుమ్రా కూడా

Published Fri, Jan 5 2024 9:12 AM | Last Updated on Fri, Jan 5 2024 10:01 AM

Sachin Tendulkar praises Bumrah - Sakshi

తొలి టెస్టులో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో భారత జట్టు సమం చేసింది. అంతేకాకుండా కేప్‌టౌన్‌లో తమ తొలి టెస్టు విజయాన్ని టీమండియా నమోదు చేసింది. 

ఇక భారత్‌ విజయంలో టీమిండియా పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ 6 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా సైతం 6 వికెట్లతో సఫారీలను చావు దెబ్బతీశాడు. ఓవరాల్‌గా ఈ టెస్టులో సిరాజ్‌ 7 వికెట్లు, బుమ్రా 8 వికెట్లు పడగొట్టారు.

ఈ క్రమంలో ప్రోటీస్‌ జట్టుతో సిరీస్‌ను సమం చేసిన రోహిత్‌ సేనను భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ప్రోటీస్‌ ఓపెనర్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌పై లిటిల్‌మాస్టర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 

'సిరీస్‌ను సమం చేసిన టీమిండియాకు అభినందనలు. అదేవిధంగా మార్క్రామ్ ఆడిన విధానం అద్భుతం. అతడి గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఇటువంటి పిచ్‌పై కొన్ని సార్లు బౌలర్లపై ఎటాక్‌ చేయడమే సరైన నిర్ణయం. మార్క్రామ్ అదే చేసి చూపించాడు. ఇక బుమ్రా కూడా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇటువంటి పిచ్‌పై ఎలా బౌలింగ్‌ చేయాలన్నది బుమ్రా చేసి చూపించాడని" సచిన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో రాసుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement