
పాయింట్ బ్లాక్ నుంచి కాల్చినా..
కేప్ టౌన్: కేప్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ నిజాం అలెగ్జాండర్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నారు. రోజుమాదిరిగానే చెక్పోస్ట్ల దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న అలెగ్జాండర్ మీద ఓ దుండగుడు తుపాకీతో పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి కాల్చడానికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న అతను దుండగునిపైకి తిరిగి కాల్పులు ప్రారంభించి, పట్టుకోవడానికి పరుగు తీశాడు. కానీ అప్పటికే దుండగుడు పరారవ్వడంతో వెంటనే తిరిగి వచ్చి తన డ్యూటీ తాను చేసుకున్నాడు.
ఇదంతా అక్కడే వెనకవైపు ఉన్న పోలీసు వాహనంలోని డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డయింది. ప్రాణాపాయం నుంచి కొద్దలో తప్పించుకున్నా, కనీసం కొంచెం గ్యాప్ కూడా తీసుకోకుండా మళ్లీ డ్యూటీలో నిమగ్నమైన ఆ అధికారిని పోలీసులు పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియోని వెస్టర్స్ కేప్ ప్రొవిన్షియల్ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.