Elgar Dismissed in Unluckiest Fashion off James Andersons Bowling - Sakshi
Sakshi News home page

ENG vs SA: పాపం ప్రోటీస్‌ కెప్టెన్‌.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది!

Published Fri, Aug 19 2022 7:32 PM | Last Updated on Fri, Aug 19 2022 8:30 PM

Elgar dismissed in unluckiest fashion off James Andersons bowling - Sakshi

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన ప్రోటిస్‌.. 161 పరుగుల లీడ్‌ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు దక్షిణాఫ్రికా బౌలర్లు చేలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 165 పరుగులకే కుప్పకూలింది. 

ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్ ఎల్గర్‌ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. 47 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను లైన్‌ లంగ్త్ బాల్‌తో జేమ్స్‌ అండర్సన్‌ బోల్తా కొట్టించాడు. ప్రోటిస్‌ ఇన్నింగ్స్‌ 23 ఓవర్‌లో జేమ్స్‌ అండర్సన్‌ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు.

అయితే బంతి నేరుగా త‌న థై ప్యాడ్‌కు తగిలి వికెట్ల వైపు దూసుకెళ్లింది. ఎల్గర్‌ బంతిని ఆపే ప్రయ్నతం చేసినా అప్పటికే అది వికెట్లను గీరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు దురదృష్టమంటే ఎల్గర్‌దే అంటూ కామెంట్లు చేస్తున్నారు.


చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: ‘భారత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్‌దే విజయం! ఎందుకంటే.. మాకు’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement