డీన్ ఎల్గర్
Dean Elgar Retirement: సౌతాఫ్రికా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కీలక ప్రకటన చేశాడు. టీమిండియాతో సిరీస్ తర్వాత తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. సొంతగడ్డపై ఆడనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తన కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు.
ఈ మేరకు.. ‘‘క్రికెట్ ఆడాలన్నది నా కల. అయితే, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం అన్నింటికంటే అత్యుత్తమైన విషయం. నా ఆశయాలను నెరవేర్చుకునే క్రమంలో 12 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఎంతో గర్వంగా ఉంది.
నాకిష్టమైన స్టేడియంలోనే..
ఇదొక అసాధారణ ప్రయాణం. ఇలాంటి అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం. సొంతగడ్డపై టీమిండియాతో సిరీస్ నా కెరీర్‌లో చివరిది కానుంది. అందమైన, అద్భుతమైన ఆట నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. కేప్‌టౌన్‌లో నా చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాను.
ప్రపంచంలోకెల్లా నా అభిమాన స్టేడియం అది. అక్కడే నేను న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా తొలిసారి టెస్టుల్లో పరుగు నమోదు చేశాను. అక్కడే నా చివరి పరుగు కూడా తీయాలనుకుంటున్నాను’’ అని డీన్ ఎల్గర్ భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు.
అందరికీ ధన్యవాదాలు
తన ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరుడు, జీవిత భాగస్వామి నికోల్, స్పాన్సర్స్, క్రికెట్ సౌతాఫ్రికా.. అన్నింటికీ మించి తనను ఇన్నాళ్లుగా ప్రోత్సహిస్తున్న అభిమానులకు ఎల్గర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
కాగా 2012లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే ఏడాది ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఎల్గర్ కెరీర్‌లో కేవలం 8 అంతర్జాతీయ వన్డేలు ఆడి.. 104 పరుగులు చేశాడు.
ఇక ఇప్పటి వరకు మొత్తంగా 84 టెస్టులు ఆడి 5146 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఎల్గర్ అత్యధిక స్కోరు 199. సౌతాఫ్రికా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన 36 ఏళ్ల డీన్ ఎల్గర్.. పలు మ్యాచ్‌లలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
చదవండి: విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే
Comments
Please login to add a commentAdd a comment