PC: CSA
Ind Vs Sa Test Series 2021-22: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే... భారత్‌పై స్వదేశంలో తమ జైత్రయాత్రకు సంబంధించిన రికార్డును కొనసాగించాలని ప్రొటిస్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో టెస్టుకు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తుండగా... భారత్‌కు లక్కీ గ్రౌండ్‌గా భావించిన వాండరర్స్‌లో విజయంతో దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్ రెట్టించిన ఉత్సాహంతో కేప్‌టౌన్‌లో ‘వార్’కు సిద్ధమవుతున్నాడు. కాగా జొహన్నస్‌బర్గ్ వేదికగా సాగిన రెండో టెస్టులో డీన్ ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
అంతేగాక ప్రొటిస్ బౌలర్లు కూడా ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు ఎల్గర్ మాట్లాడుతూ... ‘‘మూడో టెస్టు మాకు అత్యంత ముఖ్యమైనది. జొహన్నస్‌బర్గ్‌లో ఆడినట్లుగానే.. కేప్‌టౌన్‌లోనూ ఆడినట్లయితే కచ్చితంగా విజయం మాదే. నిజానికి కేప్‌టౌన్‌లో ‘పేస్’ మా డియరెస్ట్ ఫ్రెండ్’’ అని పిచ్ ఎలా ఉండబోతోందన్న అంశం గురించి హింట్ ఇచ్చాడు. హోరాహోరీ తప్పదని, తమ బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలికకాదని పరోక్షంగా టీమిండియా బ్యాటర్లకు హెచ్చరికలు జారీ చేశాడు.
చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన!
It’s not about how many times you get knocked down, but how many times you get back up💪
— Cricket South Africa (@OfficialCSA) January 7, 2022
Catch the full highlights right here ➡️ https://t.co/jVZ2TXmdRr#SAvIND #FreedomTestSeries #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/E5IbV3vhhw
Comments
Please login to add a commentAdd a comment