ఎల్గర్, పంత్(ఫైల్ ఫొటో)
సఫారీ గడ్డ మీద టెస్టు సిరీస్ విజయం సాధించాలనే తపనతో టీమిండియా.. సెంచూరియన్ పరాభవానికి బదులు తీర్చుకోవాలనే కసితో దక్షిణాఫ్రికా.. వెరసి వాండరర్స్ వేదికగా మొదలైన రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. అదే స్థాయిలో మైదానంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రొటిస్ ఆటగాడు డసెన్, భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై పెద్ద రాద్దాంతమే జరిగిన సంగతి తెలిసిందే. ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రాకు.. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్‌సెన్‌కు మధ్య మాటల యుద్ధం నడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 28వ ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతికి ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో అశూతో పాటు పంత్ బిగ్గరగా అప్పీలు చేయగా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, డీఆర్‌ఎస్‌కు వెళ్లాలా లేదా అన్న అంశంపై మరో ఎండ్‌లో ఉన్న ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ తర్జనభర్జన పడ్డాడు.
రివ్యూకు వెళ్లాలా వద్దా అన్న అంశం గురించి పీటర్సన్‌తో చర్చించాడు. ఇంతలోనే డీఆర్‌ఎస్ మీటర్ టైమ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో పంత్ ఎల్గర్‌ను తన మాటలతో కవ్వించాడు. ‘‘జబర్దస్త్ కెప్టెన్.. కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు’’ అంటూ కామెంట్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఆట విషయానికొస్తే ఇంకో ఎనిమిది వికెట్లు పడగొడితే విజయం భారత్‌ను వరిస్తుంది.. అదే 122 పరుగులు చేస్తే గెలుపు ప్రొటిస్ జట్టు సొంతమవుతుంది. కాగా నాలుగో రోజు ఆటకు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది.
చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం.. వైరల్
I loved the way rishab pant said this during the match when petersen got out😅😂🤣😂😂😂🤣😂😂 pic.twitter.com/vqeEIlT3xG
— Charan Donekal (@CDonekal) January 5, 2022
Comments
Please login to add a commentAdd a comment