PC: CSA
Dean Elgar Comments: కగిసో రబడ... ప్రొటిస్ జట్టులో ప్రధాన బౌలర్.. జొహన్నస్‌బర్గ్ టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. ఫామ్‌లోకి వచ్చి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ... అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాను రబడ అవుట్ చేశాడు. 100కు పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన ఈ జంటను, ఆ తర్వాత రిషభ్ పంత్‌ను పెవిలియన్‌కు పంపి భారత జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 6 వికెట్లు తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తోడు కెప్టెన్ డీన్ ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో జొహన్నస్‌బర్గ్ టెస్టులో విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎల్గర్ మాట్లాడుతూ.. తనకు, రబడకు మధ్య మ్యాచ్‌కు ముందు జరిగిన సంభాషణ గురించి ప్రస్తావించాడు.
డీన్ ఎల్గర్(PC: CSA)
‘‘కేజీ దగ్గరకు వెళ్లి అతడితో మాట్లాడాను. మన గ్రూపులో నీ పట్ల అందరికీ గౌరవం, అభిమానం ఉంది. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావని నేను అనుకోను. బాగా బౌలింగ్ చేస్తున్నావనే అతి విశ్వాసంతో ఉంటావని భావించను. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఎప్పుడైతే కేజీ తన ప్రతిభకు తగ్గట్లు రాణిస్తాడో... అప్పుడు తనను మించినోడు ఉండడు’’ అని చెప్పాను. తనపై ఈ మాటలు ప్రభావం చూపాయి.
బాగా ఆలోచించి ఉంటాడు. మరుసటి రోజు పక్కా ప్రణాళికతో వచ్చి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు’’ అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి రబడ రిలాక్స్ అవుతాడు.. అలాంటి సమయంలో తనను మోటివేట్ చేయాల్సి ఉంటుందని సరాదాగా వ్యాఖ్యానించాడు. నిన్ను నువ్వు తోపు అనుకోకు అంటూ తన మాటలతో రబడలో కసి పెరిగేలా చేసిట్లు పరోక్షంగా వెల్లడించాడు.
కాగా రెండో టెస్టులో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో టీమిండియాతో సమానంగా నిలిచింది ప్రొటిస్. దీంతో జనవరి 11 నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది.
చదవండి: టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్‌కు స్టార్ బౌలర్ దూరం!
Kagiso Rabada produced a fiery spell to remove both set batsmen early on Day 3 🔥
— Cricket South Africa (@OfficialCSA) January 6, 2022
Watch the full highlights here 📲 https://t.co/QyWr8FjPcu#SAvIND #FreedomTestSeries #BePartOfIt pic.twitter.com/aWg74V5LLQ
Comments
Please login to add a commentAdd a comment