South Africa vs India, 1st Test Day 2 Updates: వెలుతురు లేమి కారణంగా ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి పదకొండు పరుగుల స్వల్ప ఆధిక్యంతో టీమిండియాపై సౌతాఫ్రికా పైచేయి సాధించింది.
66: వెలుతురు లేమి కారణంగా ఆటకు అంతరాయం
వెలుతురు లేమి కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి పదకొండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఎల్గర్ 140, మార్కో జాన్సెన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా పేసర్లలో బుమ్రాకు రెండు, సిరాజ్‌కు రెండు, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి.
ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన వెరైన్. వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 249/5 (61.5)
60.4: ఆధిక్యంలోకి వచ్చిన సౌతాఫ్రికా
సిరాజ్ బౌలింగ్‌లో వెరైన్ ఫోర్ బాదడంతో ఆతిథ్య సౌతాఫ్రికా ఆధిక్యంలోకి వచ్చింది.
నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
60.1: సిరాజ్ బౌలింగ్‌లో బెడింగ్హాం(56) బౌల్డ్. దీంతో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోగా.. సెంచరీ వీరుడు ఎల్గర్‌తో కలిసి 131 పరుగుల పటిష్ట భాగస్వామ్యానికి తెరపడింది. స్కోరు: 244/4 (60.1).
బెడింగ్హాం అర్ధ శతకం
57.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా అరంగేట్రం బ్యాటర్ బెడింగ్హాం.
టీ బ్రేక్ సమయానికి
టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 49 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఎల్గర్ 115, బెడింగ్‌హాం 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.
42.1: డీన్ ఎల్గర్ సెంచరీ
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగులు పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. టెస్టుల్లో అతడికి ఇది 14వ సెంచరీ. టీమిండియాతో సిరీస్ తర్వాత రిటైర్ కానున్న ఎల్గర్.
32 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 125/3
ఎల్గర్ 76, డేవిడ్ బెగిడింగ్హాం ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.
30.2: మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
బుమ్రా బౌలింగ్‌లో కీగాన్ పీటర్సన్ బౌల్డ్ అయ్యాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
28.6: బుమ్రా బౌలింగ్లో టోనీ డి జోర్జి(28) యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. సౌతాఫ్రికా స్కోరు: 104-2(28). ఎల్గర్, కీగాన్ పీటర్సన్ క్రీజులో ఉన్నారు.
28: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా
ఎల్గర్ 65, టోనీ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 100-1
ఎల్గర్ అర్ధ శతకం.. స్కోరు: 91-1(24)
22.6: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఎల్గర్.
అర్ధ శతకానికి చేరువైన ఎల్గర్
లంచ్ బ్రేక్ తర్వాత సౌతాఫ్రికా బ్యాటర్లు కాస్త వేగం పెంచారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఎల్గర్ 45, టోని 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
49-1@ లంచ్‌బ్రేక్
భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. టీమిండియా కంటే 196 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం డీన్ ఎల్గర్ 29, టోని 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక సిరాజ్ బౌలింగ్లో మార్క్రమ్ తొలి వికెట్‌గా వెనుదిరిగిన విషయ తెలిసిందే. ఈ క్రమంలో ఎల్గర్, టోనీ ఆచితూచి ఆడుతున్నారు.
పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 33/1
7 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 22-1
ఎల్గర్ 10, టోని 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
3.5: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
టీమిండియా పేసర్ సిరాజ్‌బౌలింగ్‌లో మార్క్రమ్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 11-1(4). డీన్ ఎల్గర్, టోనీ క్రీజులో ఉన్నారు.
భారత్ 245 పరుగులకు ఆలౌట్
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు భారత్ ఆలౌటైంది. 208/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా 37 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టమైన పరిస్థితుల్లో రాహుల్ తన క్లాస్‌ను చూపించాడు.
టెయిలాండర్లతో కలిసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి(38), శ్రేయస్ అయ్యర్(31) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ ఐదు వికెట్లతో చెలరేగగా.. డెబ్యూ ఆటగాడు బర్గర్ 3 వికెట్లతో అదరగొట్టాడు.
కేఎల్ రాహుల్ సెంచరీ..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 133 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రాహుల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. రాహుల్ ప్రస్తుతం 101 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. క్రీజులో రాహుల్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు.
తొమ్మిదో వికెట్ డౌన్..
238 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సిరాజ్.. కోయట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న రాహుల్..
రెండో రోజు ఆట ప్రారంభం నుంచే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతున్నాడు. 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(80), సిరాజ్(5) పరుగులతో ఉన్నారు.
రెండో రోజు ఆట ప్రారంభం..
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు రెండు రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో కేఎల్ రాహుల్(70), మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వర్షం కారణంగా 30 నిమిషాల ఆలస్యంగా ఆట ఆరంభమైంది. కాగా తొలి రోజు టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment