టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దూరమయ్యాడు. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బావుమా గాయపడ్డాడు.
దీంతో అతడు తొలి టెస్టుల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే అతడి గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ దృవీకరించారు. ఇక రెండో టెస్టులో తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ప్రోటీస్ జట్టును నడిపించనున్నాడు. అదే విధంగా బావుమా స్ధానంలో జైబుర్ హంజా జట్టులోకి వచ్చాడు.
"బావుమా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. కానీ తొలి టెస్టులో అవసరమైతే తాను బ్యాటింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. బావుమా గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలో టెంబా కేప్ టౌన్ టెస్టుకు దూరంగా ఉండనున్నాడు. యువ ఆటగాడు జుబేర్ హంజా అతడి స్ధానాన్ని భర్తీ చేయనున్నాడని" ఈఎస్పీఎన్‌తో షుక్రి పేర్కొన్నాడు. కాగా జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: #Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణాలు అవే! అతడు అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment