డీన్ ఎల్గర్కు పిలుపు | South Africa call up Elgar to replace injured Rossouw in tri-series | Sakshi
Sakshi News home page

డీన్ ఎల్గర్కు పిలుపు

Published Thu, Jun 9 2016 4:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ రిలీ రస్క్వో ముక్కోణపు సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో డీన్ ఎల్గర్కు స్థానం కల్పిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది.

గయనా: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ రిలీ రస్క్వో  ముక్కోణపు సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో డీన్ ఎల్గర్కు స్థానం కల్పిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా  వెల్లడించింది. మంగళవారం నాటి మ్యాచ్లో రస్క్వో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తూ  గాయపడ్డాడు. అనంతరం రస్క్వోను ఆస్పత్రికి తరలించి ఎక్స్రే తీయించగా అతని కుడి భుజం జాయింట్లో కొద్దిగా చీలిక వచ్చినట్లు టీమ్ మేనేజర్ మొహ్మద్ మూసాజీ స్పష్టం చేశాడు.

 

దీంతో తదుపరి మ్యాచ్ల్లో రస్క్వో పాల్గొనే అవకాశం లేదన్నారు.  ఈ నేపథ్యంలో డీన్ ఎల్గర్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 47 పరుగుల తేడాతోవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement