South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్:
తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
రెండో టెస్ట్‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది.
మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రానే స్టబ్స్‌ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్గర్ (12) ఔటయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా
55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది.
ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా
153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్‌లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్‌లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు.
ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7
లుంగి ఎంగిడి ఒక్క ఓవర్‌లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు.
టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4
తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు.
ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా
10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది.
ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్‌లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు.
సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు
సౌతాఫ్రికా
డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment