England Vs South Africa, 2nd Test: South Africa 151 All Out In 1st Innings - Sakshi
Sakshi News home page

ENG Vs SA 2nd Test: చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. సౌతాఫ్రికా 151 ఆలౌట్‌

Published Thu, Aug 25 2022 9:30 PM | Last Updated on Fri, Aug 26 2022 8:52 AM

South Africa 151-All-Out-1st Innings Vs ENG 2nd Test - Sakshi

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్‌ గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఇంగ్లండ్‌ పేసర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఆలౌటైంది. ప్రొటీస్‌ బ్యాటర్లలో కగిసో రబడా 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం. వెరిన్నే, కీగన్‌ పీటర్సన్‌ తలా 21 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ 2 వికెట్లు, ఓలి రాబిన్‌సన్‌, జాక్‌ లీచ్‌ చెరొక వికెట్‌ తీశారు. 

ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ స్టార్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా జేమ్స్‌ అండర్స్‌న్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అండర్సన్‌ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్‌ సీనియర్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు.

చదవండి: Asia Cup 2022: పాక్‌ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం

James Anderson: జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement