ఎల్గర్‌ సెంచరీ | Elgar Century South Africa 229/4 | Sakshi
Sakshi News home page

ఎల్గర్‌ సెంచరీ

Published Thu, Mar 9 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

ఎల్గర్‌ సెంచరీ

ఎల్గర్‌ సెంచరీ

దక్షిణాఫ్రికా 229/4
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు  


డ్యునెడిన్‌: ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (262 బంతుల్లో 128 బ్యాటింగ్‌; 22 ఫోర్లు) వీరోచిత పోరాటంతో దక్షిణాఫ్రికా జట్టు కోలుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం మొదలైన తొలి టెస్టులో సఫారీ జట్టు ఆరంభంలోనే తడబడింది. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ డు ప్లెసిస్‌తో కలిసి ఎల్గర్‌ అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

ఆట ఆరంభంలోనే ఓపెనర్‌ స్టీఫెన్‌ కుక్‌ (3) సహా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆమ్లా (1), డుమిని (1) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్‌ ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతని తనపై వేసుకున్నాడు. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (118 బంతుల్లో 52; 7 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. డు ప్లెసిస్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన బవుమా (101 బంతుల్లో 38 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) కుదురుగా ఆడటంతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జతయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement