Stephen Cook
-
ఎల్గర్ సెంచరీ
దక్షిణాఫ్రికా 229/4 న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్యునెడిన్: ఓపెనర్ డీన్ ఎల్గర్ (262 బంతుల్లో 128 బ్యాటింగ్; 22 ఫోర్లు) వీరోచిత పోరాటంతో దక్షిణాఫ్రికా జట్టు కోలుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం మొదలైన తొలి టెస్టులో సఫారీ జట్టు ఆరంభంలోనే తడబడింది. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ డు ప్లెసిస్‌తో కలిసి ఎల్గర్ అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఆట ఆరంభంలోనే ఓపెనర్ స్టీఫెన్ కుక్ (3) సహా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఆమ్లా (1), డుమిని (1) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ ఎల్గర్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతని తనపై వేసుకున్నాడు. కెప్టెన్ డు ప్లెసిస్ (118 బంతుల్లో 52; 7 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. డు ప్లెసిస్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన బవుమా (101 బంతుల్లో 38 బ్యాటింగ్; 7 ఫోర్లు) కుదురుగా ఆడటంతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జతయ్యాయి. -
దక్షిణాఫ్రికా తడబాటు
అడిలైడ్: చివరి టెస్టులో పరువు కోసం పోరాడుతున్న ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాను కట్టడి చేస్తోంది. మూడో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ప్రొటీస్ ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో ఆరు వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ స్టీఫెన్ కుక్ (199 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు) జట్టుకు అండగా నిలవగా... హషీమ్ ఆమ్లా (80 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో డు ప్లెసిస్ (12) నిరాశపరిచాడు. కుక్‌తో పాటు క్రీజులో డి కాక్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు. స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు, మిషెల్ స్టార్క్ రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం జట్టు 70 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ ను 121.1 ఓవర్లలో 383 పరుగుల వద్ద ముగించింది. 307/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించగా... ఖాజా (308 బంతుల్లో 145; 12 ఫోర్లు) మొదట్లోనే అవుటయ్యాడు. స్టార్క్ (91 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. అబాట్, రబడాలకు మూడేసి వికెట్లు దక్కారుు.