
కేప్‌టౌన్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ సారథిగా వీడ్కోలు పలకనున్నాడు. భారత్‌తో సిరీస్‌కు ముందే మాజీ కెప్టెన్ ఎల్గర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. తొలి టెస్టులో అతని భారీ సెంచరీతోనే సఫారీ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు.
అయితే ఈ మ్యాచ్ మొదటి రోజునే గాయపడ్డ రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా జనవరి 3 నుంచి జరిగే రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా బోర్డు అతని కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ కోసం కెప్టెన్‌గా బరిలోకి దింపుతోంది.
చదవండి: IND Vs SA: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా!