లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ప్రోటీస్ జయభేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఇక అంతకుముందు రబడా ఐదు వికెట్లతో చేలరేగడంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలింది. కాగా లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి . అంతకుముందు 2003లో కూడా దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది.
🚨 RESULT | SOUTH AFRICA WIN BY AN INNINGS AND 12 RUNS
— Cricket South Africa (@OfficialCSA) August 19, 2022
An exceptional performance from start to finish by the entire team‼️
The bowlers sealing the victory by skittling England for 149 in the second innings to take a 1-0 lead in the 3-match series 👌#ENGvSA #BePartOfIt pic.twitter.com/WJd1eJ8P86
చదవండి:ENG-W vs IND-W: ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం!
Comments
Please login to add a commentAdd a comment