
South Africa Tour Of New Zealand 2022- క్రైస్ట్‌చర్చ్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 276 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. శుక్రవారం మొదట కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 117.5 ఓవర్లలో 482 పరుగుల వద్ద ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్ (105; 11 ఫోర్లు) శతక్కొట్టాడు. ఇక 387 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా 111 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకు ముందు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ చెలరేగడంతో 95 పరుగులకే ప్రొటిస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌కు తెరపడిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లో మొత్తంగా హెన్రీ9 వికెట్లు(7,2) పడగొట్టాడు. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించి తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ కేవలం ఒకే ఒక్క పరుగు చేయగా.. కివీస్ సారథిగా వ్యవహరించిన టామ్ లాథమ్ 15 పరుగులు సాధించాడు. బ్యాటర్‌గా ఆకట్టుకోకపోయినా కెప్టెన్‌గా ఘన విజయం అందుకున్నాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
స్కోర్లు:
న్యూజిలాండ్- 482
దక్షిణాఫ్రికా- 95 & 111
Delivering the perfect start to Day 3! @Matthenry014 with our @ANZ_NZ Play of the Day at Hagley Oval. #NZvSA pic.twitter.com/n4ojSRjX7t
— BLACKCAPS (@BLACKCAPS) February 19, 2022
Comments
Please login to add a commentAdd a comment