సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ మరోసారి తడబడ్డారు. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 కీలక వికెట్లు నష్టపోయి 35 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 258 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ 287 పరుగుల లక్ష్యం ఏర్పడింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఓపెనర్లు మురళి విజయ్(9), కేఎల్ రాహుల్(4)లు మరోసారి విఫలమవ్వగా.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో గట్టెక్కించిన కెప్టెన్ విరాట్ కోహ్లి(5) సైతం నిరాశపరిచాడు. దీంతో భారత్ కేవలం 26 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో పుజారా(11), పార్దీవ్ పటేల్(5)లు ఉన్నారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి 2 వికెట్లు తీయగా.. రబడా ఒక వికెట్ పడగొట్టాడు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 335 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 258 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 307, రెండో ఇన్నింగ్స్ 35/3
Comments
Please login to add a commentAdd a comment