దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ఫైనల్‌కు ఆర్హత సాధించింది.సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది.
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్.. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో మూడింట ఓటమి, ఒకటి డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 66.670 విన్నింగ్ శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన ఒక స్ధానం కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటీపడుతున్నాయి.
రబాడ, జాన్సెన్ విరోచిత పోరాటం..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించింది. మార్కో జాన్సెన్, కగిసో రబడా విరోచిత పోరాటంతో తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. స్వల్ప లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కేవలం 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 6 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జాన్సెన్(16), కగిసో రబాడ(31)లు అడ్డుగా నిలుచునున్నారు. అచితూచి ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది.
బాబర్ ఆజం (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో రాణించారు. అదేవిధంగా సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగా.. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs IND: మెల్‌బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు!
Comments
Please login to add a commentAdd a comment