
లియామ్ ప్లంకెట్
ఢిల్లీ: గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు దూరమైన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ స్థానంలో ఇంగ్లండ్ పేసర్ లియామ్ ప్లంకెట్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ప్లంకెట్‌ను జట్టులోకి తీసుకుంటున్న విషయాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది. దాంతో 33 ఏళ్ల ప్లంకెట్ తొలిసారి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాల్సిన రబడ గాయంతో ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెన్నునొప్పి కారణంగా రబడా మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ ఆరంభానికి రోజు ముందుగా రబడ అర్థాంతరంగా ఐపీఎల్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో ప్లంకెట్‌ను అదృష్టం వరించింది. రబడ స్థానంలో పలువురు ఆటగాళ్ల పేర్లను పరిశీలించినప్పటికీ ప్లంకెట్‌కే ఢిల్లీ తొలి ప్రాధాన్యత ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment