Liam plunkett
-
‘అక్తర్ నన్ను చంపుతానన్నాడు’
లండన్: తాను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రానికి ముందే పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చంపుతానంటూ బెదిరించాడని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్ ప్లంకెట్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2005లో అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌తో లాహోర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన తనకు తొలి మ్యాచ్‌కు ముందే చేదు అనుభవాలు ఎదురయ్యాయని ప్లంకెట్ చెప్పుకొచ్చాడు. తాను రనప్ చేస్తున్న సమయంలో ఒక నవ్వి నవ్విన అక్తర్.. చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడన్నాడు. ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని ప్లంకెట్ తెలిపాడు. ఎందుకంటే తామిద్దరం కలిసి కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న క్రమంలో ఇలా బెదిరించడం అంతుబట్టలేదన్నాడు. ‘ కౌంటీ క్రికెట్లో అక్తర్ కోసం లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తే, స్టీవ్ హార్మిసన్ కోసం స్లిప్‌లో ఉండేవాడిని. కానీ టెస్టు మ్యాచ్‌లో అక్తర్‌తో తలపడటం అదే తొలిసారి. ఆ మ్యాచ్ కోసం నేను రనప్ చేస్తున్నా. (‘నేను కారు ప్రమాదంలో చనిపోలేదు’) అప్పుడు అక్కడికి వచ్చిన అక్తర్ నన్ను చూసి నవ్వాడు. వెంటనే నిన్ను చంపేస్తా అంటూ గట్టిగా అరిచాడు. నన్ను భయభ్రాంతులకు గురి చేసే యత్నం చేశాడు. మ్యాచ్ ఆరంభమైన తర్వాత రెండో రోజు ఆటకు సిద్ధమయ్యా. నాకు తొలిరోజు ఆటలానే అనిపించింది. నేను బ్యాట్ పట్టుకుని కూర్చొని ఉన్నా. తర్వాత నాదే బ్యాటింగ్. గంటకు 96,97 మైళ్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. టీవీ స్క్రీన్లలో నాకు కనబడుతుంది. అక్తర్ అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. ఆష్లే గైల్స్ వికెట్‌ను అక్తర్ తీయడంతో నేను బ్యాటింగ్ వెళ్లాను. ఆ 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే అక్తర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డా. నేను ఆడిన తొలి బంతినే సమర్థవంతంగా ఆడా. కానీ ఒక బంతి నా భుజాన్ని తాకింది. కానీ నేను భయపడలేదు. చెట్టు మొదళ్లు వలే క్రీజ్‌లో పాతుకుపోవడానికి సిద్ధమయ్యా. అదే ధైర్యంతో 51 బంతులు ఆడి 9 పరుగులు చేశా. నా బాధ్యతను నేను నిర్వర్తించానని అనుకున్నా. దాదాపు 10 ఓవర్లు క్రీజ్‌లో ఉండి అక్తర్‌కు పరీక్షగా నిలిచా. నేను చివరికు మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యా. నా వికెట్ అక్తర్‌కు లభించకపోయినా నన్ను స్లెడ్జ్ చేసే క్రమంలో ఏదో మ్యూజిక్ చేశాడు’ అని ప్లంకెట్ తెలిపాడు. (‘ద్రవిడ్ కెప్టెన్సీకి క్రెడిట్ దక్కలేదు’) -
అమెరికాకు ఆడతా: ప్లంకెట్
లండన్: జాతీయ శిక్షణ శిబిరం కోసం ప్రకటించిన 55 మంది క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడం... ఈ విషయంపై టీమ్ మేనేజ్మెంట్ తనకు కనీస సమాచారం ఇవ్వకపో వడంపట్ల ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ జట్టు సభ్యుడు ప్లంకెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. జాబితాలో తన పేరు లేని విషయాన్ని ప్లంకెట్ ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశముంటే అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను సిద్ధమేనని ప్లంకెట్ పేర్కొన్నాడు. ‘నా భార్య అమెరికన్. అక్కడ అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశముంటే నేను సిద్ధమే. ఇంగ్లండ్‌లో చేయడానికి ఏం లేనప్పుడు అమెరికాకు ఎందుకు ఆడకూడదు?’ అని ప్లంకెట్ పేర్కొన్నాడు. -
క్రికెటర్‌ను తప్పిస్తే సమాచారం ఇవ్వరా?
లండన్: వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయిన ఇంగ్లండ్ పేసర్ లియామ్ ప్లంకెట్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మద్దతుగా నిలిచాడు. ఇటీవల 55 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టును ట్రైనింగ్ సెషన్ కోసం ఎంపిక చేయగా అందులో ప్లంకెట్ పేరు లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆలస్యం తెలుసుకున్న వాన్.. కనీసం అతనికి చెప్పకుండా ఎలా తీసేస్తారని ప్రశ్నించాడు. జట్టును ఎంపిక చేసే క్రమంలో ఎటువంటి వివక్ష చూపకుండా ఉండాలనే ప్రధాన సూత్రాన్ని సెలక్టర్లు మరిచిపోయారని వాన్ విమర్శించాడు. ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ప్లంకెట్‌పై ఎందుకు అంతటి వివక్ష అని నిలదీశాడు. (ఒక్కసారి దాదా ఫిక్స్ అయ్యాడంటే..) ప్రధానంగా అతనికి చెప్పకుండా జట్టు నుంచి తీసేయడాన్ని వాన్ ప్రశ్నించాడు. గతంలో ఒకానొక సందర్భంలో తాను అమెరికాకు ఆడే అవకాశం వస్తే ఆ దేశం తరఫున ఆడతానని ప్లంకెట్ చెప్పిన నేపథ్యంలోనే అతనిపై వేటుకు కారణమైంది. కాగా, ఈ విషయాన్ని ప్లంకెట్‌కు చెప్పి తీయాలని అంటున్నాడు వాన్. ప్లంకెట్ భార్య అమెరికా జాతీయురాలు కావడంతో వివాదానికి కారణమైంది. ప్రస్తుతం ప్లంకెట్ కూడా ఇంగ్లండ్ జట్టుకు అందుబాటులో లేడు. భార్యతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. దాంతో ప్లంకెట్‌ను పక్కన పెట్టేశారు ఇంగ్లండ్ సెలక్టర్లు. అయితే ఒకసారి ప్లంకెట్‌కు చెప్పి తీస్తే బాగుంటుందనేది వాన్ అభిప్రాయం. అలా చేయకపోతే ఈ ఆధునిక క్రికెట్లో ఒక క్రికెటర్‌ను అవమానించినట్లేనని స్పష్టం చేశాడు. ఆలస్యంగా తెలుసుకున్న ఈ వార్త తనను నిరాశకు గురి చేసిందన్నాడు. -
అరంగేట్రం అదిరింది..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ మ్యాచ్ ఆద్యంతం తడబాటుకు గురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించకపోవడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్ పంజాబ్ ఓపెనర్ అరోన్ ఫించ్(2) తీవ్రంగా నిరాశపరచగా, కేఎల్ రాహుల్(23), మయాంక్ అగర్వాల్(21)లు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆపై గేల్ స్థానంలో వచ్చిన డేవిడ్ మిల్లర్(26) కూడా విఫలమయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్(34)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఏ దశలోనూ కింగ్స్ పంజాబ్‌ను ఢిల్లీ బౌలర్లు కోలుకోనీయకుండా చేశారు. ప్రధానంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ లియామ్ ప్లంకెట్ అదరగొట్టాడు. కింగ్స్ పంజాబ్ మూడు ప్రధాన వికెట్లను తీయడంతో పాటు మెరుపులాంటి క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇవ్వడం మరో విశేషం. అతనికి జతగా అవీష్ ఖాన్, బౌల్ట్ తలో రెండు వికెట్లు సాధించగా, డానియల్ క్రిస్టియన్ వికెట్ తీశాడు. దాంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. -
రబడ స్థానంలో ఇంగ్లండ్ పేసర్
ఢిల్లీ: గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు దూరమైన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ స్థానంలో ఇంగ్లండ్ పేసర్ లియామ్ ప్లంకెట్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ప్లంకెట్‌ను జట్టులోకి తీసుకుంటున్న విషయాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది. దాంతో 33 ఏళ్ల ప్లంకెట్ తొలిసారి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాల్సిన రబడ గాయంతో ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెన్నునొప్పి కారణంగా రబడా మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ ఆరంభానికి రోజు ముందుగా రబడ అర్థాంతరంగా ఐపీఎల్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో ప్లంకెట్‌ను అదృష్టం వరించింది. రబడ స్థానంలో పలువురు ఆటగాళ్ల పేర్లను పరిశీలించినప్పటికీ ప్లంకెట్కే ఢిల్లీ తొలి ప్రాధాన్యత ఇచ్చింది. -
చివరి బంతికి సిక్స్... మ్యాచ్ టై
నాటింగ్ హామ్: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ 'టై'గా ముగిసింది. రెండు జట్లు సమాన స్కోరు సాధించడంతో ఫలితం తేలలేదు. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ నాటకీయ ఫక్కీలో డ్రా అయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. మాథ్యూస్(73), ప్రసన్న(59) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విలే, ప్లంకెట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అలీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 287 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరి వరకు అద్భుతంగా పోరాడింది. లోయర్ ఆర్డర్ లో ప్లంకెట్ మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను 'టై'గా ముగించాడు. చివరి బంతికి సిక్స్ బాదడంతో మ్యాచ్ డ్రా అయింది. 10వ స్థానంలో బ్యాటింగ్ దిగిన పంక్లెట్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ తో 22 పరుగులు బాదాడు. వోక్స్(95), బట్లర్(92), మోర్గాన్(43) రాణించారు. శ్రీలంక బౌలర్లలో లక్మాల్, మాథ్యూస్, ప్రదీప్ రెండేసి వికెట్లు తీశారు. వోక్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. -
ఫిన్ స్థానంలో ప్లంకెట్
కాలిపిక్క కండరాల గాయంతో ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టీవెన్ ఫిన్ వచ్చే నెలలో భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఫిన్ స్థానంలో మరో పేస్ బౌలర్ లియామ్ ప్లంకెట్‌ను ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.