
లండన్: జాతీయ శిక్షణ శిబిరం కోసం ప్రకటించిన 55 మంది క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడం... ఈ విషయంపై టీమ్ మేనేజ్‌మెంట్ తనకు కనీస సమాచారం ఇవ్వకపో వడంపట్ల ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ జట్టు సభ్యుడు ప్లంకెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. జాబితాలో తన పేరు లేని విషయాన్ని ప్లంకెట్ ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశముంటే అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను సిద్ధమేనని ప్లంకెట్ పేర్కొన్నాడు. ‘నా భార్య అమెరికన్. అక్కడ అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశముంటే నేను సిద్ధమే. ఇంగ్లండ్‌లో చేయడానికి ఏం లేనప్పుడు అమెరికాకు ఎందుకు ఆడకూడదు?’ అని ప్లంకెట్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment