South Africa tour of England, 2022 - England vs South Africa, 3rd Test: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా లండన్‌లోని కెనింగ్‌టన్ వేదికగా సెప్టెంబరు 8న ఆరంభమైన ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
118 పరుగులకే ఆలౌట్!
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక ప్రొటిస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ చుక్కలు చూపించారు. రాబిన్సన్ ఐదు వికెట్లు, బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా సొంతం!
ఇక ఇంగ్లండ్ 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదిలా ఉంటే.. బ్రాడ్ మరోసారి మూడు వికెట్లతో రెచ్చిపోవడం.. ఇందుకు కెప్టెన్ బెన్‌స్టోక్స్ కూడా జత కావడంతో దక్షిణాఫ్రికా 169 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి.. ఆఖరి రోజు జయభేరి మోగించింది. సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది.
రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో పాటు ప్రొటిస్ బౌలర్ కగిసొ రబడ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రబడ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.
టీ20 సిరీస్ ప్రొటిస్‌ది.. టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌ది!
మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి వన్డేలో పర్యాటక ప్రొటిస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లంఢ్ గెలుపొందింది. ఆఖరి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకోగా.. ఆఖరి రెండు టెస్టుల్లో ఓటమి పాలై.. టెస్టు సిరీస్‌ను 2-1తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.
చదవండి: ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన
SL Vs Pak: పాక్‌తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక
Comments
Please login to add a commentAdd a comment