Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున గురువారం కగిసో రబడా తొలి మ్యాచ్ ఆఢాడు. ఈ క్రమంలో వచ్చీ రావడంతోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఐపీఎల్‌లో వందో వికెట్ సాధించాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో వంద వికెట్లు సాధించేందుకు రబాడ 1438 బంతులు తీసుకున్నాడు. రబాడ తర్వాత మలింగ 1622 బంతుల్తో రెండో స్థానంలో ఉండగా.. డ్వేన్ బ్రావో 1619 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో హర్షల్‌పటేల్ 1647 బంతులతో ఉన్నాడు.
ఇక మ్యాచ్‌ల పరంగానూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో ఉన్నాడు. రబాడ 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించాడు. రబాడ తర్వాత మలింగ(70 మ్యాచ్‌లు), భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు 81 మ్యాచ్‌లు, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాలు 83 మ్యాచ్లు, యజ్వేంద్ర చహల్ 84 మ్యాచల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.
𝐴𝑎𝑡𝑒 ℎ𝑖 𝑑𝑖𝑙 𝑘ℎ𝑢𝑠ℎ 𝑘𝑎𝑟 𝑑𝑖𝑡𝑡𝑎, Rabada veere! 🙌
— JioCinema (@JioCinema) April 13, 2023
Kagiso Rabada is 🔙 with pace 🔥 as he brings up a 💯 wickets in #TATAIPL✨#PBKSvGT #IPLonJioCinema #IPL2023 | @KagisoRabada25 @PunjabKingsIPL pic.twitter.com/vnXHyt3quI
Comments
Please login to add a commentAdd a comment