fastest record
-
వచ్చీ రావడంతోనే రికార్డు.. అత్యంత వేగంగా వంద వికెట్లు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున గురువారం కగిసో రబడా తొలి మ్యాచ్ ఆఢాడు. ఈ క్రమంలో వచ్చీ రావడంతోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఐపీఎల్లో వందో వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించేందుకు రబాడ 1438 బంతులు తీసుకున్నాడు. రబాడ తర్వాత మలింగ 1622 బంతుల్తో రెండో స్థానంలో ఉండగా.. డ్వేన్ బ్రావో 1619 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో హర్షల్‌పటేల్ 1647 బంతులతో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగానూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో ఉన్నాడు. రబాడ 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించాడు. రబాడ తర్వాత మలింగ(70 మ్యాచ్‌లు), భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు 81 మ్యాచ్‌లు, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాలు 83 మ్యాచ్‌లు, యజ్వేంద్ర చహల్ 84 మ్యాచల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 𝐴𝑎𝑡𝑒 ℎ𝑖 𝑑𝑖𝑙 𝑘ℎ𝑢𝑠ℎ 𝑘𝑎𝑟 𝑑𝑖𝑡𝑡𝑎, Rabada veere! 🙌 Kagiso Rabada is 🔙 with pace 🔥 as he brings up a 💯 wickets in #TATAIPL✨#PBKSvGT #IPLonJioCinema #IPL2023 | @KagisoRabada25 @PunjabKingsIPL pic.twitter.com/vnXHyt3quI — JioCinema (@JioCinema) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ ఐపీఎల్లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. సీఎస్కేతో మ్యాచ్ సందర్భంగా బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. కాగా బట్లర్ 85 ఇన్నింగ్స్‌ల్లో 3వేల మార్క్‌ను అందుకోవడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకోగా.. కేఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకొని రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో డేవిడ్ వార్నర్(94 ఇన్నింగ్స్‌లు), ఐదో స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్(95 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. -
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు నమోదు
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాను వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 14వ ఓవర్) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు. టీమిండియా చోటు దక్కించుకున్నప్పటి నుంచి నిలకడైన వేగంతో బంతులు సంధిస్తున్న ఉమ్రాన్.. ఈ సిరీస్‌కు ముందు లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఉమ్రాన్.. ఐపీఎల్లో సైతం టీమిండియా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ 157 కిమీ వేగంతో బంతిని విసిరాడు. భారత్ తరఫున ఐపీఎల్లో ఉమ్రాన్‌దే రికార్డు. కాగా, లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 29 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..
ఓవల్: ఇంగ్లండ్‌తో రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉంది. కపిల్.. ఈ మైలురాయిని 25 మ్యాచ్‌ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా.. జడేజాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ కేవలం 18 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ల్యాండ్ మార్క్‌ను చేరుకున్న బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ లోమాన్(16) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా చార్లీ టర్నర్(17), ఇంగ్లండ్ సిడ్నీ బార్న్స్(17), ఆస్ట్రేలియా చార్లీ గ్రిమ్మెట్(17), పాక్ యాసిర్ షా(17)లు సంయుక్తంగా రెండో ప్లేస్‌లో నిలిచారు. వీరి తర్వాత అశ్విన్(18) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ ఆఖరి రోజు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. భారత బౌలర్లు బుమ్రా(2), జడేజా(2), శార్దూల్(1) ఇంగ్లండ్ విజయావకాశాలపై నీళ్లు చల్లారు. క్రీజ్‌లో రూట్(32), వోక్స్(12) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 191 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా -
ఫాస్టెస్ట్ ఉమన్: ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ
సరిగ్గా వారం క్రితం మే 23 వ తేదీ ఆదివారం ఈ ‘ఫీట్’ను సాధించారు హంగ్. బేస్ క్యాంప్ నుంచి ఆ ముందు రోజు మధ్యాహ్నం గం.1.20 లకు ఎవరెస్టును ఎక్కడం ప్రారంభించి, మర్నాడు మధ్యాహ్నం గం. 3.10 ని.లకు శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆమె తన సంతృప్తి కోసం చకచకా ఎవరెస్టును ఎక్కారు తప్ప.. ‘ఫాస్టెస్ట్ ఉమన్’ అని అనిపించుకోడానికి ఎక్కలేదట! 25 గంటల 50 నిముషాల్లో ఎక్కడం పూర్తి చేశారు. అది రికార్డు అని అప్పుడు ఆమెకు తెలియదు. పక్కనే ఉన్న టీమ్ లీడర్ షేర్పాకు, ఆ టీమ్‌లోని తక్కిన పర్వతారోహకులకూ అంత కచ్చితంగా తెలీదు. వారంతా కిందికి దిగి వచ్చాక ఈ శుక్రవారం నేపాల్ ప్రభుత్వాధికారులు త్సాంగ్ ఇన్ హంగ్ 12 గంటల తేడాతో పాత రికార్డును బద్దలు కొట్టినట్లు ప్రకటించారు! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి వేగంగా ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మహిళగా నేపాల్‌కు చెందిన ఫున్జో ఝంగ్ము లానా పేరుతో రికార్డు ఉంది. 2018 మే 17న ఆమె ఆ రికార్డును నెలకొల్పారు. 39 గంటల 6 నిముషాల్లో బేస్ క్యాంప్ నుంచి ఫున్జో ఆ రికార్డును నెలకొల్పారు. ఫున్జో రికార్డును ఇప్పుడీ హాంకాంగ్ మహిళ త్సాంగ్ ఇన్ హంగ్ తనకు తెలియకుండానే బ్రేక్ చేశారు. నిజానికి మే 12 నే శిఖరాన్ని చేరుకోవలసింది హంగ్. ఆ రోజు గాలులు ఉద్ధృతంగా ఉన్నాయి. కుమ్మరించినట్లుగా ఒకటే మంచు. 8,750 మీటర్ల ఎత్తుకు వెళ్లి కూడా అక్కడే ఆగిపోయారు. ఇక వంద మీటర్లే కదా, ఎక్కేద్దాం అనుకోలేదు. తొలిసారి ఆమె 2017 మే 21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇప్పుడు మళ్లీ ‘డ్రీమర్స్ డెస్టినేషన్ ట్రెక్స్ అండ్ ఎక్స్‌పెడిషన్’ కంపెనీ తరఫున మరొకసారి ఎవరెస్టును చేరుకున్నారు. అదీ అత్యంత వేగంగా. హంగ్ టీచర్. ఎవరెస్టు కంటే ముందు 2016లో ఆమె చైనాలోని ముజ్టాగ్ పర్వతాన్ని ఎక్కారు. ‘‘ఇదంతా నా స్టూడెంట్స్, నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం’’ అంటారు హంగ్. కలను నిజం చేసుకోలేకపోతే జీవితంలో మనం తర్వాతి అడుగు వేయలేం అని హంగ్‌కు వాళ్ల అమ్మ చెబుతుండేవారట. 2011–2019 మధ్య కాలంలో హంగ్ ఐదు వేల నుంచి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను ఇరవై సార్లు ఎక్కి దిగారు. పర్వతాలు సానుకూల ఆలోచనల్ని కలిగిస్తాయని, ఒదిగి ఉండటం నేర్పుతాయనీ హంగ్ అంటారు. -
'ఈ పిచ్‌పై మాకు మొదటి మ్యాచ్.. అందుకే'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. బెయిర్ స్టో (63* పరుగులు) కడవరకు నిలిచి జట్టును గెలిపించగా.. విలియమ్సన్ 16 పరుగులతో అతనికి సహకరించాడు. కాగా మ్యాచ్ విజయం అనంతరం ప్రెజంటేషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ''చెన్నైలో మాకు ఇది మొదటి మ్యాచ్.. పిచ్ పరిస్థితి మాకు కొత్త కావడంతో ఇలా ఆడుతామని ఊహించలేదు. కానీ మేము చేసిన స్కోరుకు అదనంగా మరో 10-15 పరుగులు జతచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎస్ఆర్హెచ్ గెలుపుకు వారి బౌలింగ్ ఒక కారణం కావొచ్చు.. ఎందుకంటే వాళ్లు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడడంతో పిచ్‌పై అవగాహన వచ్చేసింది. ఇక మా బ్యాటింగ్ ఈరోజు అనుకున్నంత బాలేదు. చేసింది తక్కువ స్కోరైనా మా బౌలర్ల ప్రదర్శన తక్కువ చేయలేము. అయితే వరుసగా మూడు మ్యాచ్‌లు పరాజయం చెందడం తో ఒత్తిడి పెరిగినా.. రానున్న మ్యాచ్‌లపై దాని ప్రభావం లేకుండా చూసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు. అంతకముందు మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతోపాటు అత్యంత వేగంగా 5000 పరుగుల మార్కును అందుకున్న రెండో క్రికెటర్‌గా కూడా చరిత్ర పుటల్లోకెక్కాడు. సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సింగల్ తీయడంతో రాహుల్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. రాహుల్ పొట్టి ఫార్మాట్లో 143 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తి చేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి 167 ఇన్నింగ్స్‌ల్లో, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా 173 ఇన్నింగ్స్‌ల్లో ఆ మార్కును అందుకున్నారు. ఇక ఓవరాల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగులు పూర్తి చేసిన రికార్డు విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ కేవలం 132 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్కును చేరుకోగా, రాహుల్ 143 ఇన్నింగ్స్‌ల్లో, న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్ 163 ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగులు పూర్తి చేసి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్ధేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఎస్ఆర్హెచ్ 9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. చదవండి: అలాంటి పరిస్థితుల్లో గంభీర్‌లా ఆడాలని ఉంటుంది: పడిక్కల్ -
'రికార్డు గురించి తెలియదు'
క్రిస్ట్‌చర్చ్: తాను టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నమోదు చేసిన విషయం క్రీజ్‌లో ఉన్నప్పుడు తెలియదని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ స్సష్టం చేశాడు. తాను క్రీజ్‌లోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ బంతిని బౌండరీ దాటించే యత్నం మాత్రమే చేశానన్నాడు. అది ఇలా రికార్డుగా నమోదు అవుతుందని అస్సలు ఊహించలేదని మెకల్లమ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో శనివారం ఆరంభమైన రెండో టెస్టులో మెకల్లమ్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తద్వారా 1986లో ఇంగ్లాండ్ పై విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 56 బంతుల్లో సెంచరీ కొట్టిన రికార్డుతో పాటు ఆ తర్వాత 2014లో ఆస్ట్రేలియాపై పాకిస్థానీ బ్యాట్స్ మన్ మిస్బావుల్ హక్ 56 పరుగుల్లోనే 100 పరుగులు చేసిన రికార్డులను మెకల్లమ్ చెరిపేశాడు. దీనిపై ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన మెకల్లమ్.. తాను బ్యాట్ తో పరుగులు వర్షం కురిపించాలని మాత్రమే ప్రయత్నించానన్నాడు. ఆ క్రమంలో బౌలర్లపై ఎదురుదాడికి దిగి ప్రతీ బంతిని బౌండరీ దాటించే యత్నం చేశానన్నాడు. తన ఆదర్శ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ రికార్డును అధిగమించడం చాలా గర్వంగా ఉందన్నాడు. ఈ రికార్డు కంటే మ్యాచ్ లో గెలుపే ముఖ్యమని మెకల్లమ్ తెలిపాడు. ఈ ఇన్నింగ్స్ లో మెకల్లమ్(145;79 బంతుల్లో 21 ఫోర్లు,6 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో కూడా మెకల్లమ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఆ వన్డే మ్యాచ్ లో 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో మెకల్లమ్ 47 పరుగులు చేశాడు. మరోవైపు కివీస్ తరపున టెస్టుల్లో ఏకైక ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనత మెకల్లమ్ పేరిటే ఉండటం విశేషం.