IPL 2023, CSK Vs RR: అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా | Jos Buttler Third-Fastest To 3000 Runs In IPL History - Sakshi
Sakshi News home page

Jos Buttler: అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా

Published Wed, Apr 12 2023 8:20 PM | Last Updated on Thu, Apr 13 2023 10:38 AM

Jos Buttler Becomes 3rd Batter Fastest To Complete 3000 IPL Runs  - Sakshi

Photo: IPL Twitter

రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ ఐపీఎల్‌లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌ సందర్భంగా బట్లర్‌ ఈ ఫీట్‌ సాధించాడు. కాగా బట్లర్‌ 85 ఇన్నింగ్స్‌ల్లో 3వేల మార్క్‌ను అందుకోవడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా బట్లర్‌ నిలిచాడు.

ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్‌ 75 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకోగా.. కేఎల్‌ రాహుల్‌ 80 ఇ‍న్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ అందుకొని రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌(94 ఇన్నింగ్స్‌లు), ఐదో స్థానంలో ఫాఫ్‌ డుప్లెసిస్‌(95 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement