పంజాబ్ కింగ్స్ (Photo Credit: Punjab Kings/IPL)
IPL 2023- Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్-2023లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్‌తో ఢొకొట్టేందుకు ధావన్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. పవర్ హిట్టర్, ఇంగ్లంగ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ రాకతో పంజాబ్‌లో జోష్ వచ్చింది. తమ స్టార్ ప్లేయర్ వచ్చేశాడని.. అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయంటూ కింగ్స్ జట్టు లివింగ్‌స్టోన్ ఫొటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది.
కాగా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమైన లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ బెంచ్‌కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని పరిశీలిద్దాం.
గుజరాత్‌తో పంజాబ్ ఢీ
ఓపెనర్లుగా ప్రబ్‌సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్‌స్టోన్‌ను వన్‌డౌన్‌లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
అదే విధంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే ఆఖరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉండనే ఉంటాడు.
గతంలో చెరోసారి
ఇక.. బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబడ, నాథన్ ఎల్లిస్‌లలో ఒకరు.. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా గత మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో సన్‌రైజర్స్ చేతిలో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
మరోవైపు.. గుజరాత్‌కు సైతం గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూపంలో ఈ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా గురువారం మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సందర్భాల్లో చెరో విజయం నమోదు చేశాయి.
గుజరాత్‌తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్
తుది జట్ల(అంచనా):
పంజాబ్ కింగ్స్
ప్రబ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, సికిందర్ రజా, జతేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్.
గుజరాత్ టైటాన్స్
వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్.
చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా..
సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్
All the focus is on 𝐨𝐧𝐞 𝐦𝐚𝐧! 📸@liaml4893 is ready to Roar 🦁#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wo7boR6Qvk
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023
Comments
Please login to add a commentAdd a comment