photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ముఖ్యంగా వరుస పరాజయాల బాట పట్టిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలుపు బూస్టప్ ఇస్తుంది. ఈ జట్టు ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
మరోవైపు పంజాబ్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు గత మ్యాచ్‌లో గెలిచిందనే కాని, ఓవరాల్‌గా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో తుది జట్లలో ఎవరెవరు ఉండే అవకాశముందో అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. భుజం గాయం కారణంగా లక్నోతో జరిగిన గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే లేట్‌గా జట్టుతో చేరి, అనంతరం నెట్స్‌లో గాయపడిన ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్.. ఆర్సీబీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
లివింగ్ స్టోన్ తుది జట్టులోకి వస్తే గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సికందర్ రజా, ఆసీస్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌లలో ఎవరో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ విషయానికొస్తే.. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఆసీస్ పేసర్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నట్లు సమాచారం.
ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గత మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో మాత్రం రెండు మార్పులకు ఆస్కారం ఉంది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అథర్వ స్థానంలో ధవన్.. షార్ట్, సికిందర్ రజాలలో ఎవరో ఒకరి స్థానంలో లివింగ్‌స్టోన్ తుది జట్టులోకి రావచ్చు.
తుది జట్లు (అంచనా)..
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్, మాథ్యూ షార్ట్/లివింగ్‌స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రబాడ, అర్షదీప్ సింగ్
ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, విజయ్‌కుమార్ వైశాఖ్, సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment