
స్టెయిన్ స్థానంలో రబడా
డర్బన్: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో నాలుగు కీలక వికెట్లు తీసి గాడిలో పడ్డట్లు కనిపించిన దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్ డేల్ స్టెయిన్ కు భుజం గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో శనివారం నుంచి కేప్ టౌన్ లో ఆరంభం కానున్న రెండో టెస్టుకు స్టెయిన్ దూరం కానున్నాడు.. ఈ మేరకు కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఓ ప్రకటనలో స్టెయిన్ కు విశ్రాంతినిస్తున్నట్లు తెలిపాడు. అతని స్థానంలో రబడాను తుది జట్టులో తీసుకుంటున్నామని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా గత ఐదు టెస్టుల నుంచి జట్టుకు దూరంగా ఉంటున్న వికెట్ కీపర్ డీ కాక్ రేపటి టెస్టులో ఆడనున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో సఫారీలు 241 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండో టెస్టులో గెలిచి సిరీస్ లో శుభారంభం చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.