Photo Courtesy: Delhi Capitals Twitter
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్ కగిసో రబడాను టార్గెట్ చేసిన పంజాబ్ కింగ్స్ పించ్ హిట్టర్ క్రిస్ గేల్.. చివరకు అతని ట్రాప్‌లోనే పడ్డాడు. రబడా వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టిన గేల్.. ఆ తర్వాత బంతికి అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. సుమారు 144 కి.మీ వేగంతో వేసిన ఫుల్ టాస్‌ను అంచనా వేయడంలో విఫలమైన గేల్.. బ్యాట్స్ పెట్టేలోపే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. షార్ట్ బంతిని వేస్తాడని గేల్ ప్రిపేర్ కాగా, రబడా ఫుల్‌టాస్ వేశాడు. దాంతో గేల్ తేరుకునే లోపే ఆ బంతి కాస్తా వెళ్లి వికెట్లపై పడింది.
తన బ్యాక్‌లెగ్‌తో బంతిని ఆపుదామని యత్నించినా చివరకు ఔట్ కావడంతో గేల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు ప్రభ్ సిమ్రాన్‌ను సైతం రబడానే ఔట్ చేశాడు. నాల్గో ఓవర్ మూడో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌కు వేయగా దాన్ని ప్రభ్ సిమ్రాన్ క్లియర్ చేయడానికి యత్నించాడు. ఆ సమయంలో ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ ఎడమవైపు దూకి మరీ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. తొలుత స్మిత్ పట్టిన క్యాచ్, ఆ తర్వాత గేల్ బౌల్డ్ అయిన విధానం రెండూ కూడా మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాయి.
Photo Courtesy: Delhi Capitals Twitter
Comments
Please login to add a commentAdd a comment