రబడ బౌలింగ్‌లో సిక్స్ బాదుతున్న కోహ్లి
సెంచూరియన్: ‘కసి’కి ఫ్యాంటు, షర్టు తొడిగితే అది అచ్చుగుద్దినట్టు విరాట్ కోహ్లిలా ఉంటుంది. మైదానంలో అగ్రెసివ్‌గా ఉండటమే కాదు ఆటతోనూ సత్తా చాటుతున్నాడు టీమిండియా కెప్టెన్. అతడిని రెచ్చగొడితే కొదమ సింహంలా విరుచుకుపడతాడు. దీనికి తాజా రుజువు దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కనిపించింది.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి టీమిండియాను కట్టడి చేసేందుకు సఫారీ బౌలర్లు పదేపదే బౌన్సర్లు సంధించారు. ఓపెనర్ రోహిత్ శర్మను అవుట్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ కాజిసొ రబడ.. కోహ్లిపైనా కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాలని తెగ ప్రయత్నించాడు. విరాట్ బాడీని టార్గెట్ చేసి బంతులు విసిరాడు. ఈ క్రమంలో ఓ బంతి నేరుగా కోహ్లికి తగిలింది. దీంతో ‘మిస్టర్ ఫైర్’ కాసేపు బాధతో విలవిల్లాడు.
నొప్పి తగ్గిన తర్వాత మళ్లీ బ్యాట్ పట్టి అతడికి తగిన గుణపాఠం చెప్పాడు. రబడ మళ్లీ తన స్టైల్లో బంతి వేయగా కోహ్లి అంతకుముందు బాల్‌ను ఆడినట్టుగానే ఆడి సిక్సర్ బాదాడు. అంతే మైదానం ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగింది. అతడు కొట్టిన ఒకే ఒక సిక్సర్ రబడ బౌలింగ్‌లో బాదిందే కావడం విశేషం. రెండో వన్డేలో 9 వికెట్లతో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తుగా ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment