
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా యువ సంచలనం కగిసో రబడ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ మంగళవారం తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్‌లో ఒక్క స్థానాన్ని మెరుగు పరుచుని టాప్ ర్యాంకు సాధించాడు. దీంతో ఇంగ్లండ్ స్టార పేసర్ జేమీ అండర్సన్ రెండో ర్యాంకుకు పడిపోయాడు.
టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 3/34, 2/41 తో రాణించిన సఫారీ పేసర్ రబడ జట్టు విజయంలో తోడ్పడటంతో పాటు 5 పాయింట్లు మెరుగు పరుచుకుని 888 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి టెస్టులో 1/56 తో ఏమాత్రం ఆకట్టుకోని అండర్సన్ ఐదు పాయింట్లు కోల్పోయి 887 పాయింట్లకు పడిపోయాడు. దీంతో అగ్రస్థానాన్ని రబడకు కోల్పోయాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్‌వుడ్ ఐదో ర్యాంకులో ఉన్నాడు.
యథాస్థానాల్లో జడేజా, అశ్విన్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు తమ ర్యాంకులను నిలుపుకున్నారు. 861 పాయింట్లతో జడేజా, 830 పాయింట్లతో అశ్విన్‌లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు.
ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్
1. కగిసో రబడ 888 పాయింట్లు
2. జేమీ అండర్సన్ 887
3. రవీంద్ర జడేజా 861
4. రవిచంద్రన్ అశ్విన్ 830
5. జోష్ హజల్‌వుడ్ 814
6. ఫిలాండర్ 806
7. రంగన హెరాత్ 799
8. నీల్ వాగ్నర్ 784
9. మిచెల్ స్టార్క్ 769
9. నాథన్ లయన్ 769
Comments
Please login to add a commentAdd a comment