రబడా.. బా...గా స్వింగ్‌ చేశాడు! | Kagiso Rabada’s shocking delivery leaves teammates in splits | Sakshi
Sakshi News home page

రబడా.. బా...గా స్వింగ్‌ చేశాడు!

Published Mon, Nov 19 2018 11:02 AM | Last Updated on Mon, Nov 19 2018 12:01 PM

Kagiso Rabada’s shocking delivery leaves teammates in splits - Sakshi

క్వీన్స్‌లాండ్‌:  దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్లలో కగిసో రబడా ఒకడు. ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రబడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఆసీస్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో రబడా ఎవరూ ఊహించని బంతిని సంధించి వార్తలో నిలిచాడు. సాధారణంగా బౌలర్లు బంతిని వేసే క్రమంలో వికెట్‌ కీపర్‌కు అందకుండా కానీ, స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ వైపు కానీ వేయడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాగా, చేతి నుంచి జారిందో.. లేక బాగా స్వింగ్‌ చేద్దామని అలా వేశాడో కానీ రబడా వేసిన  ఒక బంతి వెళ్లి పాయింట్‌లో ఉన్న ఫీల్డర్‌ చేతిలో పడింది.

రబాడా వేసి బాల్‌ను వైడ్‌గా ప్రకటించాలా?లేక నో బాల్‌గా ఇవ్వాలో తెలియక అంపైర్లు కూడా కాసేపు చర్చించుకున్నారు. అయితే చివరికి దానిని డెడ్ బాల్‌గా ప్రకటించారు.  సాధారణంగా కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరిచే రబడా.. ఇలా బంతిని వేయడంతో జట్టు సభ్యుల్లో నవ్వులు పూయించింది. అంతేకాదు అసలేం జరిగిందో తనకే తెలియక బిక్కమొహం వేశాడు రబడా.  దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 21 పరుగులతో గెలిచిన దక్షిణాఫ్రికా 1-0తో టీ20 సిరీస్‌ను గెలిచింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement