
దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడా తొలిసారి కెరీర్ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ప్రతీ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల చొప్పున మొత్తం పది వికెట్లను సాధించిన రబడా తన రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుకని మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
తద్వారా ఇప్పటివరకూ ఈ స్థానంలో ఉన్న భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ను రబడా అధిగమించాడు. మరొకవైపు పాకిస్తాన్ పై యూఏఈలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక ఆరో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ను లంకేయులు వెనక్కునెట్టారు.