జోహన్నెస్‌బర్గ్ : ప్రపంచంలో ఇలాంటి ఇల్లు మాత్రం మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే ఆ ఇంట్లో అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తాయి. సాధారణంగా ఇంటిపై కప్పు గాలిలో ఉంటే ఫ్లోర్ మాత్రం నేలపై ఉంటుంది. కానీ ఆ ఇంట్లో మాత్రం రివర్స్‌గా ఉంటుంది. అలాంటి ఇంటిని మీరు చూడాలనుకుంటే మాత్రం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్టిబీస్ట్‌పూర్ట్ అనే ప్రాంతానికి వెళ్లాల్సిందే. అయితే ఈ ఇంట్లో మాత్రం ఎవరు నివసించరు. ఎందుకంటే అది పర్యాటకులను ఆకట్టుకునేందుకు అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రసుత్తం అక్కడికి వచ్చే పర్యాటకులను ఈ కట్టడం విపరీతంగా ఆకర్షిస్తుంది.
ఇంట్లో ఉండే సోఫాల దగ్గరి నుంచి కుర్చీలు, కిచెన్‌లో ఏర్పాటు చేసిన వస్తువులు అన్ని రివర్స్‌లో కనిపిస్తాయి. ఇంటి ఆర్కిటెక్చర్‌ను ఎవరు చూసిన ముగ్దులయ్యేలా తీర్చిదిద్దారు. కాగా సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, శుక్ర, శనివారాల్లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల మధ్య సందర్శనకు అందుబాటులో ఉంచుతారు . ఇంటి లోపలికి వెళ్లడానికి పెద్దవాళ్లకు 90 సౌత్ ఆఫ్రికా రాండ్‌లు( భారత కరెన్సీలో దాదాపు రూ.415), చిన్నపిల్లలకు 60 సౌత్ ఆఫ్రికా రాండ్(దాదాపు రూ. 277) వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని ఇది వరకే సందర్శించిన పలువురు 'ఇది నిజంగా అద్భుతమైన కట్టడం.. ' అని కామెంట్లు పెడుతున్నారు. 'ఇలాంటి ఇల్లును కచ్చితంగా చూసి తీరాల్సిందే..' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment