Tourist attraction
-
ఆకాశానికి నిచ్చెన
బాల భీముడు స్వర్గానికి నిచ్చెన వేశాడని చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం. అంతులేని నిచ్చెనను ఆకాశంలోకి వేశాడని చెప్పుకున్నాం. అయితే, పాతకాలంనాటి ఒక అంతస్తు ఎత్తు నిచ్చెన ఎక్కితేనే వామ్మో అనేస్తాం. అలాంటిది అత్యంత పొడవైన నిచ్చెనను ఎక్కగలరా ? అని ఇప్పుడు చైనా ప్రపంచవ్యాప్తంగా ధైర్యవంతులైన పర్యాటకులకు సవాల్ విసిరింది. సవాల్ స్వీకరించిన వేలాది మంది ఔత్సాహిక పర్యాటకులు చలో చైనా అంటున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే పర్వతమయ ప్రాంతంలో రెండు కొండలను కలుపుతూ ఒక భారీ నిచ్చెనను అక్కడ ఏర్పాటుచేశారు. పట్టుకుంటే జారిపోయే సన్నని అత్యంత నునుపైన నిటారు నిచ్చెనను ఎక్కేందుకు ఇప్పుడు జనం క్యూలు కడుతున్నారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్జియాజీ నేచర్పార్క్లోని మౌంట్ క్విజింగ్ కొండ నుంచి సమీప కొండకు ఈ పొడవైన నిచ్చెనను నిర్మించారు. నేల నుంచి ఏకంగా 5,000 అడుగుల ఎత్తులో 551 అడుగుల పొడవున ఈ ‘టియాంటీ’నిచ్చెనను ఎక్కాల్సి ఉంటుంది. చైనా భాషలో టయాంటీ అంటే ఆకాశ నిచ్చెన అని అర్థం. రోజూ 1,200 మందికిపైగా జనం ధైర్యంగా దీనిని ఎక్కేస్తున్నారు. చాలా మంది భయపడి వెనుతిరుగుతున్నారు. సగం మెట్లు ఎక్కాక కిందికి చూస్తే కళ్లు తిరగడం ఖాయం. కింద మొత్తం లోయ ఉంటుంది. నాకు కోటి రూపాయలు ఇచి్చనాసరే ఈ నిచ్చెనను మాత్రం ఎక్కనుబాబోయ్ అని కొందరు నెటిజన్లు సంబంధిత వీడియోలు చూశాక కామెంట్లు చేశారు. నిచ్చెన ఎక్కేటప్పుడే కాదు ఎక్కకముందు కూడా పర్యాటకులు వామ్మో అంటున్నారు. ఎందుకంటే టికెట్ ధర ఏకంగా రూ.8,500. నాలుగు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులనే నిచ్చెన మీదకు అనుమతిస్తున్నారు. చైనాలో ఔట్‌డోర్ క్రీడలు ఆడే వారి సంఖ్య గత ఏడాది 40 కోట్లకు చేరింది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త రకం సాహసక్రీడలను చైనా సంస్థలు పరిచయం చేస్తున్నాయి. -
భారత్‌తో పెట్టుకుంటే అట్లుంటది మరి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు!
మాలే: భారత్‌తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భారత్‌తో మాల్దీవుల ప్రభుత్వం కయ్యానికి దిగడంతో అసలుకే ఎసరు వచ్చింది. దీంతో, పర్యాటకం రూపంలో మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగింది మాల్దీవులు. ఇంతకీ ఏమైందంటే.. చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం.. భారత్‌తో కయ్యానికి దిగింది. ఈ క్రమంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినండంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నది. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే భారత్‌లోని ముఖ్యమైన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ భావిస్తున్నది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నది. కాగా, మాల్దీవులకు భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్. ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇరుదేశాల మధ్య పర్యటక సంబంధాలను పెంపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెట్స్ సంస్థ తెలిపింది. ఇక, మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్.. ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్ (66,999), రష్యా (66,803), ఇటలీ (61,379), జర్మనీ (52,256), భారత్ (37,417)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో, మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. -
ప్రపంచంలోనే ఇలాంటి హోటల్ ఎక్కడా లేదు.. అంత స్పెషల్ ఏంటంటే..
ప్రపంచంలో అక్కడక్కడా కాలంచెల్లిన బోయింగ్ విమానాల్లో నడిపే హోటళ్లు ఉన్నాయి. అయితే, టర్కీలో మాత్రం ఏకంగా విమానం ఆకారంలోనే నిర్మించిన విలాసవంతమైన హోటల్ ఉంది. ప్రపంచంలో ఇలాంటి హోటల్ ఇదొక్కటే! ప్రైవేట్ బీచ్, ఒక ‘పెద్దలకు మాత్రమే’ స్విమ్మింగ్‌పూల్ సహా నాలుగు స్విమ్మింగ్‌పూల్స్, ఒక ఆక్వా పార్క్ ఈ హోటల్ ప్రత్యేకతలు. టర్కీలోని అంతాల్యా నగరానికి చేరువలోని లారా సముద్రతీరం వద్దనున్న ఈ హోటల్ పేరు ‘కాంకోర్డ్ డీలక్స్ రిసార్ట్’. అంతాల్యా విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనున్న ఈ హోటల్ టర్కీలో పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ హోటల్లో పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేకమైన కిడ్స్ క్లబ్, మినీ గోల్ఫ్‌కోర్స్, టెన్నిస్ కోర్ట్ తదితరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో విందు వినోదాల కోసం పన్నెండు రెస్టారెంట్లు, పదహారు బార్లు కూడా ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఇందులో ఒకరోజు బస చేసేందుకు 73 పౌండ్లు (రూ.7,245) మాత్రమే! -
నేచర్ లవర్స్‌కి గుడ్‌న్యూస్! కబిని, కూర్గ్‌లకు హెలికాప్టర్ సర్వీసులు
Helicopter Ride From Bangalore To Coorg: హెలికాప్టర్ సేవల సంస్థ బ్లేడ్ ఇండియా కొత్తగా బెంగళూరు–కూర్గ్, బెంగళూరు–కబిని రూట్లలో సర్వీసులను ప్రారంభించింది. బెంగళూరు నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సుమారు 6–7 గంటల సమయం పడుతుంది. కర్ణాటకలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలకు చేరుకోవడం ప్రయాసతో కూడుకున్నదని సంస్థ ఎండీ అమిత్ దత్తా తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల సమయమంతా ప్రయాణంలో వృధా కాకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుని, అక్కడ సరదాగా గడిపేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. అమెరికాకు చెందిన బ్లేడ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ, దేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ హంచ్ వెంచర్స్ కలిసి 2019లో బ్లేడ్ ఇండియాను ప్రారంభించాయి. వారాంతాల్లో ప్రైవేట్ చార్టర్ సేవలు అందించడం ద్వారా 2020 డిసెంబర్లో బ్లేడ్ ఇండియా.. కర్ణాటక రాష్ట్రంలో సర్వీసులు మొదలుపెట్టింది. దేశంలోనే ప్రముఖ హిల్ స్టేషన్‌గా కూర్గ్ ప్రకృతి అందాలకు కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇక కబిని టైగర్ రిజర్వ్ ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కబిని ఫారెస్ట్‌లో కనిపించే బ్లాక్ చీతాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. చదవండి: ఎల్జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..! -
విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి..
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): కార్తీకంలో వన విహారం చేయాలనుకునే ప్రకృతి ప్రేమికులకు మంచి విడిది టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం. అంతర్జాతీయ స్థాయిలో విశిష్టత కలిగిన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ జాతులకు చెందిన విదేశీ పక్షుల విడిది కేంద్రం ఇది. వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చే పక్షులను చూడడానికి సందర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. తప్పక చూడండి: ► పక్షుల విన్యాసాలను వీక్షించాలంటే వాచ్‌టవర్‌ను ఎక్కాల్సిందే. ► విదేశీ పక్షుల విశేషాల్ని సోదాహరణంగా వివరిస్తూ ఓ మ్యూజియం ఉంది. ► రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ► భావనపాడు సముద్రతీరం అందాలు చూసి తీరాల్సినవి. ఎలా వెళ్లాలి.. ► శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి టెక్కలి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► టెక్కలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో తేలినీలాపురం ఉంది. ► టెక్కలి నుంచి రావివలస 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► భావనపాడు సముద్ర తీరం టెక్కలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► పూర్తి స్థాయి రవాణా సదుపాయాలున్నాయి. చదవండి: Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ -
దీపావళి స్పెషల్ 2021: కామాఖ్య ఆలయం.. విహార విశేషాలు!
శుభ కామన దీపం అస్సాం రాష్ట్రం, గువాహటి. నీలాచల పర్వత శ్రేణులతో అందమైన ప్రదేశం. ఇక్కడే ఉంది కామాఖ్య ఆలయం. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పురాణకాలంలో నరకాసురుడు నిర్మించాడని చెబుతారు. పదహారవ శతాబ్దం నాటి పాలకులు ధ్వంసం చేయడంతో పదిహేడవ శతాబ్దంలో స్థానిక కూచ్‌బేహార్ పాలకుడు మహారాజా బిశ్వసింగ్ పునర్నిర్మించాడు. కామరూప రాజ్యానికి ప్రతీక దేవత కాబట్టి కామాఖ్య అనే పేరు వచ్చినట్లు మరో కథనం. ప్రధాన ఆలయానికి సమీపంలో సౌభాగ్య కుండం ఉంది. దీనిని దేవతల రాజు దేవేంద్రుడు తవ్వించాడని నమ్మకం. మరో ప్రధాన కుండం పేరు భైరవ్ కుండం. ఇందులో మనం ఊహించనంత పెద్ద సైజు తాబేళ్లుంటాయి. కటి బిహు పంటల వేడుక కూడా ఈ సమయంలో జరుగుతుంది. దీపాలు వెలిగించడమే ప్రధానం. తులసి చెట్టు దగ్గర మొదలు పెట్టి ఇంటి ఆవరణ అంతా దీపాలతో వెలుగులు నింపుతారు. ఇంటింటా వెలిగే దీపాలతోపాటు ఊరంతా సామూహికంగా వెలిగించే దీపాన్ని ఆకాశబంటి అంటారు. దీపం వెలిగిస్తూ ఏ కోరిక కోరితే అది తప్పక నెరవేరుతుందని నమ్ముతారు. బ్రహ్మపుత్రలో విహారం మూడు రోజుల కామాఖ్య టూర్ ప్యాకేజ్‌లో గువాహటి విమానాశ్రయంలో టూర్ ఆపరేటర్లు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అయిన తరవాత సాయంత్రం బ్రహ్మపుత్ర నదిలో సన్‌సెట్ క్రూయిజ్ విహారం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కామాఖ్య దేవి దర్శనం, ఆ తర్వాత బాగలా ఆలయం, భువనేశ్వరి, ఉమానంద, నబగ్రహ, ఉగ్రతార, సుక్లేశ్వర్, బాలాజీ ఆలయాలు, భీమశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం, వశిష్ట ఆలయం, హస్తకళల ఎంపోరియమ్ సందర్శనం ఉంటాయి. మూడవ రోజు గువాహటి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడంతో టూర్ ప్యాకేజ్ పూర్తవుతుంది. ఈ సీజన్లో క్రూయిజ్ ప్యాకేజ్‌లో కటి బిహు వేడుకలను కూడా చూసే అవకాశం ఉంటుంది. కన్నడ తీరాన రాయల విడిది మడకశిరలో సత్యభామ సంతాన వేణుగోపాల స్వామితోపాటు దర్శనమిస్తుంది. అదే విగ్రహంలో రుక్మిణి కూడా ఉంటుంది. దీపావళి సందర్భంగా ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలతో సమానమైన వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు. కర్నాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన రాయలు ఇక్కడ ఆలయాన్ని కట్టించి, తన విహారకేంద్రంగానూ, విడిది కేంద్రంగానూ మలుచుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు వృద్ధాశ్రమం నిర్మించి అభాగ్యులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించడమైంది. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే... తులసీమాత ఆలయం. దేశంలో మరెక్కడా తులసీమాతకు ఆలయం లేదని ఇది మాత్రమే ఏకైక ఆలయం అని ఇస్కాన్ ధృవీకరించింది. దీపావళి పండుగతోపాటు దీపావళి తర్వాత పన్నెండు రోజులకు వచ్చే చిలకద్వాదశి కూడా వేడుకగా నిర్వహిస్తారు. ట్రావెల్ టిప్స్ ►మీరు వెళ్తున్న ప్రదేశంలో కరోనా కేసుల తీవ్రతలేదని నిర్ధారించుకున్న తరవాత మాత్రమే ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే మీరు నివసిస్తున్న ప్రదేశంలో కూడా కరోనా తీవ్రత లేకపోతేనే ఇతర ప్రదేశాలకు వెళ్లాలి. ►మీ బస శానిటైజ్ అయినదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. అవసరమైతే మరోసారి శానిటైజ్ చేయవలసిందిగా కోరాలి. ►మీరు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇంకా వేసుకోనట్లయితే పర్యటన ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ►పర్యాటక ప్రదేశంలో పరిసరాల పరిశుభ్రత, ఆహార శుభ్రతతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ►మీ ఇంట్లో కోవిడ్ హైరిస్క్ పీపుల్ ఉంటే మీ పర్యటన ఆలోచన మానుకోవడమే మంచిది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
Weekend Tourist Spot: గోదావరి తీరం.. శ్రీరాముడి విహారం..
ఈ ఊరిపేరు పోచంపాడు. శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ సంచరించాడని స్థానికుల విశ్వాసం. అందుకే పోచంపాడులో నిర్మించిన ప్రాజెక్టు శ్రీరామ్సాగర్గా పేరు తెచ్చుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్... చక్కటి వీకెండ్ హాలిడే స్పాట్. పిల్లల కేరింతలు, పెద్దవాళ్ల తాదాత్మ్యతతో ఈ టూర్ పరిపూర్ణమవుతుంది. మహాగమనం మహారాష్ట్రలో పుట్టిన గోదావరి గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులను దాటుకుని తెలంగాణలో అడుగుపెట్టి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుతో వేగానికి కళ్లెం వేసుకుంటుంది. పర్యాటకులను అలరిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం. పుష్కర సాగర్ పోచంపాడు గోదావరి నది పుష్కరాలకు కూడా ప్రసిద్ధి. గడచిన పుష్కరాలలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది నదిలో స్నానమాచరించారు. పుష్కరాలతో ప్రమేయం లేకుండా నదిస్నానం కోసం పర్యాటకులు ప్రతి శుక్రవారం, ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా వస్తారు. భవిష్యత్తులో బోటు షికారు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో బోటింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసి బాసర వరకు బోట్లు నడపాలని తెలంగాణ టూరిజం నిర్ణయించింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి బాసరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం. ఇంతదూరం బోటు షికారు చేయడం పర్యాటకులకు అంతులేని ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. టూరిజం కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. త్యాగచరిత 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోచంపాడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1978కి ప్రాజెక్టు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను త్యాగం చేయడంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జీవం పోసుకుంది. ఎంతెంత దూరం! ఎలా వెళ్లాలి! శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతీయ రహదారి 44కు మూడు కి.మీ దూరంలో ఉంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సులు పోచంపాడు∙మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ పోచంపాడు మీదుగానే ప్రయాణిస్తాయి. పోచంపాడు... హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్‌కు 50 కిలోమీటర్లలో, నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. – చంద్రశేఖర్, భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
Chikmagalur: చిక్‌మగళూరు.. మంచి కాఫీలాంటి విహారం
మనం ఏదైనా చేస్తే అది ప్రత్యేకంగా ఉండాలి. అలాంటిది మరొకటి లేదనేటట్లు కూడా ఉండాలి. అంతేకాదు... నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి వస్తువూ పర్యావరణానికి హాని కలిగించనిదై ఉండాలి. ఆ మెటీరియల్ అంతా భవనాన్ని కూల్చినప్పుడు తిరిగి మట్టిలో ఇట్టే కలిసిపోయేదై ఉండాలి... ఇది కర్నాటక, చిక్‌మగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కి వచ్చిన ఆలోచన. ఆ ఆలోచనకు ప్రతిరూపమే చిక్‌మగళూరు, ఎఐటి కాలేజ్ రోడ్లో ఉన్న సన్యాట ఎకో రిసార్ట్. చూసి వద్దాం! సోలార్ పవర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఎర్త్ టన్నెల్స్‌తో ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఎకో రిసార్టు నిర్మాణంలో ఇటుకల నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా తయారు చేశారు. పిల్లర్లకు కూడా ఇనుము ఉపయోగించలేదు. వర్షపు నీటి నిల్వ కోసం భూగర్భంలో యాభై వేల లీటర్ల కెపాసిటీ ట్యాంకు ఉంది. బాత్రూమ్లో వాడిన నీటిని శుద్ధి చేసి టాయిలెట్ ఫ్లష్‌కు, మొక్కలకు చేరే ఏర్పాటు... ఇలా ఒక ప్రయోగమే జరిగింది. నాచురల్ ఎయిర్ కండిషనర్‌గా రూపుదిద్దుకున్న ఈ రిసార్ట్‌లో పదకొండు గదులున్నాయి. చిక్‌మగళూరు వాతావరణం వేడిగానే ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణంలో ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల మధ్యనే ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలతో ఈ ఎకో రిసార్టు చిక్‌మగళూరు పర్యాటక ప్రదేశాల జాబితాలో ఒకటైంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ రిసార్టులో బస చేయగలిగింది కొందరే, ఎక్కువమంది పర్యాటకులు ఈ రిసార్టును చూడడానికే వస్తుంటారు. రిసార్టు ఆవరణలో చిక్‌మగళూరు చుట్టు పక్కల తయారయ్యే హస్తకళాకృతుల స్టాల్స్ కూడా ఉంటాయి. చిక్‌మగళూరు టూర్లో చూడగలిగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో! అవి ఎంతెంత దూరాన ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ ఉన్నాయి! ►బేలూరులో హొయసల రాజుల నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకలను చూడవచ్చు. ఇది చిక్మగళూరుకి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. బేలూరు చూసిన వాళ్లు హలేబీడును చూడకుండా ఉండలేరు. ఇది బేలూరుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ►శృంగేరి మఠం... తుంగ నది తీరాన చిక్‌మగళూరుకు ఎనభై కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడే శారదా పీఠం కూడా ఉంది. మహాత్మా గాంధీ పార్క్. ఇది చిక్‌మగళూరు బస్‌స్టాండ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరాన రత్నగిరి బోరెలో ఉంది. ►బల్లాలరాయన దుర్గ ఫోర్ట్... ఇది డెబ్బై కిలోమీటర్ల దూరాన కొండ మీద ఉంది. కర్నాటక– ద్రవిడ నిర్మాణశైలుల సమ్మేళనం ఈ కోట. కవికాల్ గండి వ్యూ పాయింట్... ఇది పద్దెమినిది కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి చిక్మగళూరులోని పర్యాటక ప్రదేశాలు కనువిందు చేస్తాయి. ►ఝరీ వాటర్ ఫాల్స్... దాదాపు తొంబై కిలోమీటర్ల దూరాన అత్తిగుండి గ్రామంలో ఉంది. తెల్లగా ఉండే నీటి ధారలను పాలతో పోలుస్తూ జలపాతానికి పాలధారను ఉపమానంగా చెప్పడం తెలిసిందే. అయితే ఇక్కడి వాళ్లు ఈ జలపాతం నీటిని మజ్జిగతో పోలుస్తారు. కాఫీ తోటల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ►జెడ్ పాయింట్... ఇది అరవై కిలోమీటర్ల దూరాన పదిహేను వందల మీటర్ల ఎత్తు కొండ మీద ఉంది. ట్రెకింగ్ లవర్స్‌కు ఇది మంచి లొకేషన్. ►కాఫీ మ్యూజియం... ఆరు కిలోమీటర్ల దూరాన దాసరహల్లిలో ఉంది. చిక్‌మగళూరు వెళ్లిన వాళ్లెవరూ ఈ కాఫీ మ్యూజియాన్ని చూడకుండా రారు. ఘుమఘుమలాడే కాఫీ గింజల పరిమళాన్ని ఆస్వాదిస్తూ... కాఫీ మొక్క నుంచి కాఫీ తయారయ్యే వరకు ప్రతి ప్రక్రియనూ చూడవచ్చు. ►ఖుద్రేముఖ్ నేషనల్ పార్క్... ఇది వంద కిలోమీటర్ల దూరాన ఉంది. ట్రిప్‌లో ఒక రోజును ఈ నేషనల్ పార్క్ కోసమే కేటాయించుకోవాలి. ఏమి తినాలి? ఎక్కడ తినాలి? ►చిక్మగళూరులోని మహారాజా రెస్టారెంట్లో మటన్ బిర్యానీ రుచి చూడాలి. ►బ్రేక్‌ఫాస్ట్‌కి టౌన్ క్యాంటీన్ ప్రసిద్ధి. ఇందులో వెన్న రాసిన క్రిస్పీ దోశె తిని మంచి కాఫీ తాగడం మర్చిపోవద్దు. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లో గులాబ్ జామూన్ ఇస్తారు. ►మెసూర్ ఫుడ్స్‌లో... మైసూర్ మసాలా దోశె, మైసూర్ బజ్జీలు కన్నడదేశంలో పర్యటిస్తున్నామని గుర్తు చేస్తాయి. ►చిక్మగళూరులో మాంసాహారులు, శాకాహారులతోపాటు వేగాన్లకు కూడా ప్రత్యేక రుచులు ఉంటాయి. -
ఇలాంటి వింత ఇల్లు ఎప్పుడైనా చూశారా!
జోహన్నెస్‌బర్గ్ : ప్రపంచంలో ఇలాంటి ఇల్లు మాత్రం మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే ఆ ఇంట్లో అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తాయి. సాధారణంగా ఇంటిపై కప్పు గాలిలో ఉంటే ఫ్లోర్ మాత్రం నేలపై ఉంటుంది. కానీ ఆ ఇంట్లో మాత్రం రివర్స్‌గా ఉంటుంది. అలాంటి ఇంటిని మీరు చూడాలనుకుంటే మాత్రం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్టిబీస్ట్పూర్ట్ అనే ప్రాంతానికి వెళ్లాల్సిందే. అయితే ఈ ఇంట్లో మాత్రం ఎవరు నివసించరు. ఎందుకంటే అది పర్యాటకులను ఆకట్టుకునేందుకు అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రసుత్తం అక్కడికి వచ్చే పర్యాటకులను ఈ కట్టడం విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇంట్లో ఉండే సోఫాల దగ్గరి నుంచి కుర్చీలు, కిచెన్‌లో ఏర్పాటు చేసిన వస్తువులు అన్ని రివర్స్‌లో కనిపిస్తాయి. ఇంటి ఆర్కిటెక్చర్‌ను ఎవరు చూసిన ముగ్దులయ్యేలా తీర్చిదిద్దారు. కాగా సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, శుక్ర, శనివారాల్లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల మధ్య సందర్శనకు అందుబాటులో ఉంచుతారు . ఇంటి లోపలికి వెళ్లడానికి పెద్దవాళ్లకు 90 సౌత్ ఆఫ్రికా రాండ్లు( భారత కరెన్సీలో దాదాపు రూ.415), చిన్నపిల్లలకు 60 సౌత్ ఆఫ్రికా రాండ్(దాదాపు రూ. 277) వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని ఇది వరకే సందర్శించిన పలువురు 'ఇది నిజంగా అద్భుతమైన కట్టడం.. ' అని కామెంట్లు పెడుతున్నారు. 'ఇలాంటి ఇల్లును కచ్చితంగా చూసి తీరాల్సిందే..' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్!
గ్రీస్ : పర్యాటకులపై నుంచి కొద్ది అడుగుల దూరంలోనే విమానం వెళ్లి రన్‌వేపై ల్యాండ్ అయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రిటిష్ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పర్యాటకుల తలలపై నుంచి అతి తక్కువ దూరంలో వెళుతూ రన్‌వేపై ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయ్యే సందర్భంలో కొంతమంది పర్యాటకులు మరింత దగ్గరగా చూడటానికి గోడపైకి ఎక్కడంతో గాలివేగానికి కిందపడబోయారు. ఈ సంఘటన గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయంలో జరిగింది. ఈ విమానాశ్రయం తక్కువ ఎత్తులో ల్యాండ్ అయ్యే విమానాలకు ప్రసిద్ధి చెందింది. స్కియాథోస్ విమానాశ్రయాన్ని ‘యూరోపియన్ సెయింట్ మార్టిన్’ అని పిలుస్తారు. ఇది యూరప్‌లోని అత్యంత క్రేజీ విమానాశ్రయాలలో ఒకటి. ఇక్కడ భారీ విమానాలు సైతం చిన్న రన్‌వేపై వెళ్తూ కనువిందు చేస్తుంటాయి. దీంతో ఈ దృశ్యాలను చూస్తూ, తమ వీడియోలలో బంధించడానికి వందల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అలాగే ఇక్కడ అందమైన బీచ్ కూడా ఉంది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ తలలపై వెళ్లే విమానాలకు బైబై చెప్తూ పర్యాటకులు సరదాగా గడిపేస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకపరంగా ఉద్వేగాలకు గురిచేసే ప్రాంతంగా పేరుపొందింది. అలాగే ఇక్కడి సుందరమైన దృశ్యాలు పర్యావరణ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ‘ఈ ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ఎత్తులో విమానాలు ల్యాండ్ కావడం చాలా సహజం, రన్‌వే చిన్నగా ఉండటంతోనే ఇలా జరుగుతుందని’ స్థానికులు అంటున్నారు. ఈ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అనుమతించబడిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. నేడు ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తూ గ్రీసు దేశంలోని ప్రధాన పర్యాటకప్రాంతాలలో ఒకటిగా మారింది. -
గజపతి జిల్లాలో..ప్రకృతి సోయగం
పర్లాకిమిడి ఒరిస్సా : గజపతి జిల్లాలో పలు చోట్ల దర్శనమిస్తున్న ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని ఆయా చోట్ల ఉన్న జలపాతాలు, జమీందారుల కాలం నాటి కట్టడాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు జిల్లాలో దాగున్న ప్రకృతి సోయగాలను చూసేందుకు పోటెత్తుతున్నారు. జిల్లాలోని మహేంద్రగిరి పర్వతాలు, జిరంగోకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న బౌద్ధ మందిరం, గండాహతి జలపాతం, గుద్గుదా జలపాతం, సెరంగో ఘాట్ రోడ్ అందాలు, చంద్రగిరి టిబెటియన్ ప్రాంతంలో ఉన్న అనేక రకాల పండ్ల తోటలను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు తరచూ జిల్లాకు వస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దమని స్థానికులు కొన్నాళ్లుగా కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. పర్యాటక కేంద్రంతో జిల్లాకు మేలు గజపతి జిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించి అభివృద్ధిపరిస్తే స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏటా మహేంద్రగిరి పర్వతం పైన ఉన్న శివుని, భీమ, కుంతి, యుధిష్టర ఆలయాలను శివరాత్రి రోజున భక్తులు తిలకించేందుకు పోటీపడతారు. వీటితో పాటు వివిధ పక్షుల కిలకిల రావాలు వినేందుకు, అక్కడి నుంచి ప్రకృతి సోయగాలకు వీక్షించేందుకు పర్యాటకులు నిత్యం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు వచ్చే ఔత్సాహికులకు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం గుర్తించి, గజపతి జిల్లాను అభివృద్ధి చేస్తే ఎంతో మేలు చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆకర్షిస్తున్న మహేంద్రగిరి అందాలు మహేంద్రగిరి పర్వతం సముద్ర మట్టానికి సుమారు 1500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచి చూస్తే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని మందస, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న శ్రీముఖలింగం వంటి శైవ మందిరాలు పర్యాటకులకు కనిపిస్తూ అబ్బురపరుస్తాయి. వేకువజామున కనిపించే మహేంద్రగిరి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు ఉదయమే మహేంద్రగిర ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయంలో మహేంద్రగిరి పర్వతం నుంచి వచ్చే సూర్యోదయం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పర్వతం పైకి ట్రెకింగ్‌కు వెళ్లేందుకు వీలుగా ట్రెకింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తామని అప్పట్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఉన్న సూర్యనారాయణ పాత్రో ప్రకటించారు.కానీ ఇంతవరకూ అది కార్యరూపం దాల్చకపోవడం పట్ల జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. త్రీస్టార్ హోటల్ కోసం నిధులు కేటాయించినా.. వీటితో పాటు ప్రస్తుతం పర్లాకిమిడిలో ఉన్న బృందావన్ ప్యాలెస్‌ను త్రీస్టార్ హోటల్‌గా తయారు చేసేందుకు గతంలో పర్యాటక శాఖ రూ.లక్షల ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గజపతి జిల్లాలోని ఆయా పర్యాటక ప్రదేశాలు ఇప్పుడు ఒడిశా చలన చిత్ర మండలిని కూడా ఆకర్షించడంతో పలు సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుండడం విశేషం. జిల్లాలోని బీఎన్ ప్యాలెస్, గజపతి ప్యాలెస్‌లలో షూటింగ్స్ తరచూ జరుగుతుండడం విశేషం. ఊటీని తలపిస్తోన్న సెరంగో పర్లాకిమిడికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెరంగో ప్రాంతం ఊటీని తలపించే రీతిలో అత్యద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కోయిపూర్–కించిలింగి రోడ్డు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖకు అప్పగించడంతో మరికొద్ది రోజుల్లోనే మహేంద్రగిరికి కారులో వెళ్లేందుకు వీలు కలుగుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెలుస్తున్న రిసార్టులు, రెస్టారెంట్లు పర్లాకిమిడికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండహతి జలపాతాల పక్కన పలు రిసార్టులు, రెస్టారెంటులు ఇప్పుడిప్పుడే వెలుస్తున్నాయి. ఇదే ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ వీఐపీ గెస్ట్‌హౌస్ కూడా నిర్మించారు. ఇదే మార్గంలో పర్లాకిమిడిని చేరుకోవడానికి విశాఖపట్నం, పూరీ, భువనేశ్వర్ నుంచి రైల్వే మార్గం కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్న గజపతి జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం సులువేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతానికి ప్యాసింజర్ రైలుతో పాటు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం నడుస్తున్నాయి. పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. గజపతి జిల్లాను పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపరిస్తే జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను పర్యాటక కేంద్రం చేయమని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించి, అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
అబ్బుర పరిచే సోయగం.. రాయికల్ జలపాతం
చుట్టూ అడవులు.. పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. సహజసిద్ధంగా జాలువారే జలపాతాలు.. హోరెత్తే నీటి హొయలు.. వెరసి ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయిన అద్భుత ‘చిత్రం’.. రాయికల్ జలపాతం. వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో.. వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా మిగిలిపోయిన ఈ జలపాతం.. ఇప్పుడిప్పుడే పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. – సాక్షి, హైదరాబాద్ కమనీయం.. ప్రకృతి రమణీయం చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు.. ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదిక్కడ. 170 అడుగుల ఎత్తు నుంచి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతూ ఉంటుంది. 5 అంచెలలో సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. చక్కటి పర్యాటక కేంద్రం కరీంనగర్, వరంగల్ నగరాలకు అత్యంత సమీపం లో ఉండటం వల్ల ఈ జలపాతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతానికి ఏ మాత్రం తీసిపోని విధంగా రాయికల్ జలపాతం ఉంటుంది. అయితే ఈ జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, కొండలపై భాగంలో ఎలుగుబంట్లు ఉండటం తదితర కారణాల రీత్యా ఇది అంతగా ఆదరణకు నోచుకోలేదు. సరైన భద్ర తా చర్యలు చేపట్టి, అవసరమైన సౌకర్యాలను సమకూరిస్తే ఇది తెలంగాణలో ఓ మంచి పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశం ఉందని పర్యాటకుల అభిప్రాయం. ఆద్యంతం ఆహ్లాదభరితం ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంతదూరం గుట్టల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం వరంగల్ సమీపంలో లేనే లేదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న చెరువు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పర్యాటకులకు ఏమి కావాలన్నా వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. చేపట్టాల్సిన భద్రతా చర్యలివీ ♦ నీళ్లలో ప్రమాదవశాత్తు పడితే బయటపడేందుకు జలపాతాల వద్ద ఇరువైపులా తాళ్లు ఏర్పాటు చేయాలి. ♦ జలపాతాల వద్ద తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది నియామకం. ♦ నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు. ♦ నీళ్లలోకి వెళ్లకుండా ఇరువైపులా జాలీ ఏర్పాట్లు ఎలా వెళ్లాలి? హుస్నాబాద్ సిద్దిపేట రోడ్లో ములుకనూరు వద్ద కుడి వైపు వెళ్లాలి. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన వంగర మీదుగా రాయికల్ గ్రామానికి వెళ్లాలి. గ్రామం నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది. అక్కడ వాహనాలను నిలిపి , జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను చేరుకోవచ్చు. -
ప్రేమ ఫుడ్ అయింది!
లాభం తెచ్చిపెట్టే వాటిపై శ్రద్ధ, ప్రేమ ఎక్కువగా ఉండటం సహజమే. టోక్యోకు పర్యాటక ఆకర్షణ శక్తిని పెంచుతున్న అక్వేరియంలలోని చేపల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏదో పడేస్తే తింటాయని వదిలేయకుండా.. స్విమ్మర్ చేత చేపలకు ప్రత్యేకంగా ఆహారాన్ని తినిపించే ఏర్పాట్లు చేశారక్కడ. టోక్యోలోని సన్‌షైన్ అక్వేరియంలో ఫీడింగ్ సెషన్లో భాగంగా లవ్‌సింబల్ రూపంలో కోసి ఉంచిన రెడ్మీట్ను చేపలకు తినిపిస్తున్న దృశ్యమిది.