సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): కార్తీకంలో వన విహారం చేయాలనుకునే ప్రకృతి ప్రేమికులకు మంచి విడిది టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం. అంతర్జాతీయ స్థాయిలో విశిష్టత కలిగిన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ జాతులకు చెందిన విదేశీ పక్షుల విడిది కేంద్రం ఇది. వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చే పక్షులను చూడడానికి సందర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు.
తప్పక చూడండి:
► పక్షుల విన్యాసాలను వీక్షించాలంటే వాచ్‌టవర్‌ను ఎక్కాల్సిందే.
► విదేశీ పక్షుల విశేషాల్ని సోదాహరణంగా వివరిస్తూ ఓ మ్యూజియం ఉంది.
► రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది.
► భావనపాడు సముద్రతీరం అందాలు చూసి తీరాల్సినవి.
ఎలా వెళ్లాలి..
► శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి టెక్కలి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది.
► టెక్కలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో తేలినీలాపురం ఉంది.
► టెక్కలి నుంచి రావివలస 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
► భావనపాడు సముద్ర తీరం టెక్కలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
► పూర్తి స్థాయి రవాణా సదుపాయాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment