Helicopter Ride From Bangalore To Coorg: హెలికాప్టర్ సేవల సంస్థ బ్లేడ్ ఇండియా కొత్తగా బెంగళూరు–కూర్గ్, బెంగళూరు–కబిని రూట్లలో సర్వీసులను ప్రారంభించింది. బెంగళూరు నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సుమారు 6–7 గంటల సమయం పడుతుంది. కర్ణాటకలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలకు చేరుకోవడం ప్రయాసతో కూడుకున్నదని సంస్థ ఎండీ అమిత్ దత్తా తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల సమయమంతా ప్రయాణంలో వృధా కాకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుని, అక్కడ సరదాగా గడిపేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్‌తో జట్టు కట్టినట్లు వివరించారు.
అమెరికాకు చెందిన బ్లేడ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ, దేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ హంచ్ వెంచర్స్ కలిసి 2019లో బ్లేడ్ ఇండియాను ప్రారంభించాయి. వారాంతాల్లో ప్రైవేట్ చార్టర్ సేవలు అందించడం ద్వారా 2020 డిసెంబర్‌లో బ్లేడ్ ఇండియా.. కర్ణాటక రాష్ట్రంలో సర్వీసులు మొదలుపెట్టింది. దేశంలోనే ప్రముఖ హిల్ స్టేషన్‌గా కూర్గ్ ప్రకృతి అందాలకు కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇక కబిని టైగర్ రిజర్వ్ ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కబిని ఫారెస్ట్‌లో కనిపించే బ్లాక్ చీతాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు.
చదవండి: ఎల్‌జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment