అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నైజీరియాలోని అతిపెద్ద access bank సీఈఓతో సహా 9 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు.
కాలిఫోర్నియాలోని నిప్టన్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయిన సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
వారిలో access bank యాక్సెస్ బ్యాంక్ గ్రూప్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే ఉన్నారని, ఆయన మరణాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజో ఇవెలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నైజీరియన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ మాజీ చైర్మన్ అబింబోలా ఒగున్బాంజో సైతం విగ్వే మరణాన్ని ధృవీకరించారు.
ఈ సందర్భంగా.. ప్రమాద స్థలం హాలోరాన్ స్ప్రింగ్స్ రోడ్డు సమీపంలోని 15-ఫ్రీవేకు తూర్పున ఉందని నిర్ధారించామని శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ హెలికాప్టర్‌ను యూరోకాప్టర్ ఈసీ 130గా గుర్తించిన ఎఫ్ ఏఏ.. నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో కలిసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా, లాస్ వెగాస్కు వెళ్తుండగా నెవాడా- కాలిఫోర్నియా సరిహద్దు నగరం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment