ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచాయి.
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది.
ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్‌లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. .
సాధారణ పౌరులకు, ఫిక్స్‌డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment