బాల భీముడు స్వర్గానికి నిచ్చెన వేశాడని చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం. అంతులేని నిచ్చెనను ఆకాశంలోకి వేశాడని చెప్పుకున్నాం. అయితే, పాతకాలంనాటి ఒక అంతస్తు ఎత్తు నిచ్చెన ఎక్కితేనే వామ్మో అనేస్తాం. అలాంటిది అత్యంత పొడవైన నిచ్చెనను ఎక్కగలరా ? అని ఇప్పుడు చైనా ప్రపంచవ్యాప్తంగా ధైర్యవంతులైన పర్యాటకులకు సవాల్ విసిరింది. సవాల్ స్వీకరించిన వేలాది మంది ఔత్సాహిక పర్యాటకులు చలో చైనా అంటున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే పర్వతమయ ప్రాంతంలో రెండు కొండలను కలుపుతూ ఒక భారీ నిచ్చెనను అక్కడ ఏర్పాటుచేశారు.
పట్టుకుంటే జారిపోయే సన్నని అత్యంత నునుపైన నిటారు నిచ్చెనను ఎక్కేందుకు ఇప్పుడు జనం క్యూలు కడుతున్నారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌జియాజీ నేచర్‌పార్క్‌లోని మౌంట్ క్విజింగ్ కొండ నుంచి సమీప కొండకు ఈ పొడవైన నిచ్చెనను నిర్మించారు. నేల నుంచి ఏకంగా 5,000 అడుగుల ఎత్తులో 551 అడుగుల పొడవున ఈ ‘టియాంటీ’నిచ్చెనను ఎక్కాల్సి ఉంటుంది. చైనా భాషలో టయాంటీ అంటే ఆకాశ నిచ్చెన అని అర్థం. రోజూ 1,200 మందికిపైగా జనం ధైర్యంగా దీనిని ఎక్కేస్తున్నారు. చాలా మంది భయపడి వెనుతిరుగుతున్నారు.
సగం మెట్లు ఎక్కాక కిందికి చూస్తే కళ్లు తిరగడం ఖాయం. కింద మొత్తం లోయ ఉంటుంది. నాకు కోటి రూపాయలు ఇచి్చనాసరే ఈ నిచ్చెనను మాత్రం ఎక్కనుబాబోయ్ అని కొందరు నెటిజన్లు సంబంధిత వీడియోలు చూశాక కామెంట్లు చేశారు. నిచ్చెన ఎక్కేటప్పుడే కాదు ఎక్కకముందు కూడా పర్యాటకులు వామ్మో అంటున్నారు. ఎందుకంటే టికెట్ ధర ఏకంగా రూ.8,500. నాలుగు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులనే నిచ్చెన మీదకు అనుమతిస్తున్నారు. చైనాలో ఔట్‌డోర్ క్రీడలు ఆడే వారి సంఖ్య గత ఏడాది 40 కోట్లకు చేరింది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త రకం సాహసక్రీడలను చైనా సంస్థలు పరిచయం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment