
జొహన్నెస్‌బర్గ్ : ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(ఆశా) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జొహన్నెస్‌బర్గ్‌లోని దాదాపు 800మంది తెలుగు వారు ఈ ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలకి, పెద్దలకి ఆటల పోటీలు నిర్వహించారు. సంప్రదాయక నృత్యాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. పురోహితుడు పంచాంగ శ్రవణం చేశారు.
అతిథులకు ఉగాది పచ్చడితోపాటూ రుచికరమైన ఆంధ్ర వంటకాలను ఏర్పాటు చేశారు. అనంతపురం వంటకం ఒలిగలు( బొబ్బట్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ కాన్సుల్ జనరల్ కేజే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెసిడెంట్ కుమార్ ఎద్దులపల్లి ఆశా ప్రస్థానం గురించి వివరించారు. ఆశా రైతు సంఘం తరపున అనంతపురం జిల్లా ఎద్దులపల్లిలో ఏడుగురు పేద రైతులకి వడ్డిలేని ఋణం కింద రూ. 4,55,000 ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆశా చైర్మన్ సుబ్రమణ్యం చిమట ఉగాది వేడుకలను విజయవంతం చేయడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.










