Ind Vs Sa 2nd Test: ప్రొటిస్‌కు అత్యధిక పరాజయాలు ఇక్కడే.. మరి ఈసారి? | Ind Vs Sa 2nd Test: South Africa Record In Wanderers Stadium | Sakshi
Sakshi News home page

Ind Vs Sa 2nd Test: ప్రొటిస్‌కు అత్యధిక పరాజయాలు ఇక్కడే.. మరి ఈసారి?

Published Mon, Jan 3 2022 9:49 AM | Last Updated on Mon, Jan 3 2022 10:04 AM

Ind Vs Sa 2nd Test: South Africa Record In Wanderers Stadium - Sakshi

 Ind Vs Sa Test Series: ఆత్మవిశ్వాసంతో టీమిండియా... ఎదురుదెబ్బల నడుమ దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ ఇందుకు వేదిక. ఈ మైదానంలో టీమిండియా ఇంతవరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. మరి.. ప్రొటిస్‌ రికార్డు ఇక్కడ ఎలా ఉందంటే... 

►అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాక స్వదేశంలో వాండరర్స్‌ మైదానంలోనే దక్షిణాఫ్రికా అత్యధిక పరాజయాలు చవిచూసింది. ఓవరాల్‌గా ఈ వేదికపై దక్షిణాఫ్రికా 31 టెస్టులు ఆడింది. 11 టెస్టుల్లో ఓడి, 14 టెస్టుల్లో గెలిచింది, ఆరు టెస్టులు ‘డ్రా’ చేసుకుంది.  

ఇక రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు నమోదు చేయగలిగే రికార్డులు ఇవే
► ఈ మ్యాచ్‌లో మరో 6 వికెట్లు తీస్తే కపిల్‌దేవ్‌ (434 వికెట్లు)ను మూడో స్థానానికి నెట్టి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ (ప్రస్తుతం 429 వికెట్లు) గుర్తింపు పొందుతాడు. 619 వికెట్లతో అనిల్‌ కుంబ్లే టాపర్‌గా ఉన్నాడు.

► మరో 146 పరుగులు సాధిస్తే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. కోహ్లి ఇప్పటివరకు 98 టెస్టులు ఆడి 7,854 పరుగులు సాధించాడు.

చదవండి: SA vs IND: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు
Ind Vs Sa 2nd Test: అక్కడ ఒక్కసారి కూడా భారత్‌ టెస్టు ఓడలేదు.. వాళ్లిద్దరికీ సూపర్‌ రికార్డు.. కాబట్టి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement