మహాద్భుతం... వాండరర్స్‌లో తొలి టెస్టు ఫలితాన్ని వర్ణించేందుకు ఈ మాట సరిపోదు. ఎవరన్నారు టెస్టు క్రికెట్ చచ్చిపోతోందని... టెస్టులపై ఆసక్తి తగ్గిపోయిందని... జొహన్నెస్‌బర్గ్‌లో చివరి రోజు ఆటను చూసినవారు ఈ మ్యాచ్‌లో ‘డ్రా’మాను ఎప్పటికీ మరచిపోలేరు. ఎన్నెన్నో మలుపులు... మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... ఒకరివైపు మొగ్గిన విజయం అంతలోనే మరొకరి పక్షాన నిలుస్తూ వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆఖరి బంతి వరకు టెస్టు క్రికెట్‌లో ఫలితం కోసం ఎదురు చూడాల్సి రావడం అంటే ఆ మ్యాచ్ గొప్పతనం ఏమిటో అర్థ్ధమవుతోంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 280 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 244 భారత్ రెండో ఇన్నింగ్స్: 421 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) షమీ 76; స్మిత్ రనౌట్ 44; ఆమ్లా (బి) షమీ 4; డు ప్లెసిస్ రనౌట్ 134; కలిస్ ఎల్బీడబ్ల్యూ (బి) జహీర్ 34; డివిలియర్స్ (బి) ఇషాంత్ 103, డుమిని (బి) షమీ 5; ఫిలాండర్ నాటౌట్ 25; స్టెయిన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 450 వికెట్ల పతనం: 1-108, 2-118, 3-143, 4-197, 5-402, 6-407, 7-442 బౌలింగ్: జహీర్ 34-1-135-1, ఇషాంత్ 29-4-91-1, షమీ 28-5-107-3, అశ్విన్ 36-5-83-0, మురళీ విజయ్ 1-0-3-0, ధోని 2-0-4-0, కోహ్లి 6-0-18-0.