రష్యాతో తమ బంధం ఎంతో విలువైనదని, భారత్-రష్యా దేశాలు బహుళ రంగాల్లో కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో తెలిపారు. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పర్యటనకు మోదీ బుధవారం దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శుక్రవారం భేటి అయ్యారు.