indian flag
-
ఇదీ ఫ్లాగ్ కోడ్.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు!!
సాక్షి, సిటీబ్యూరో: దేశ ప్రాథమిక, ప్రధాన చిహ్నం.. భారత గౌరవ ప్రతీక.. శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని ప్రతిబింబించేది జాతీయ జెండా. ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు పలు ప్రత్యేక రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటాం. అంతేకాకుండా దేశభక్తిని, భారత ప్రతిష్టను ప్రదర్శించే వివిధ సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని వినియోగిస్తాం. ఇటీవలి కాలంలో హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే జాతీయ జెండా ఎగరవేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఈ నియమావళికి ఏ మాత్రం అవాంతరం ఎదురైనా దేశ ప్రతిష్టకే అవమానం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం సూచించిన ఫ్లాగ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవంతుల మీద, ప్రభుత్వాధికారులకు మాత్రమే ఎగరవేసే ఆధికారముండేది. 2001లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టు కేసులో భాగంగా ప్రతి పౌరుడూ జెండాను ఎగరేయొచ్చని సవరించింది. జాతీయ జెండా పరిరక్షణకు సంబంధించి 1950, 1971 చట్టాలతో పాటు 2002, 2005లో సవరించిన అంశాలతో నూతన జాతీయపతాక నియమావళిని రూపొందించింది. ఈ నియమావళిలో భాగంగా పతాకం నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్‌గా, వేదికకు ముందు భాగంలో వాడకూడదు.ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయకూడదు, విగ్రహాలమీద, ఇతర వస్తువులకు కప్పకూడదు. నడుం కింది భాగంలో, లోదుస్తులమీద జెండాను వాడకూడదు. ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం నిషిద్ధం. సాధారణంగా సూర్యోదయంలో జెండాను ఎగరవేసి, సూర్యాస్తమయంలో దించివేయాలి. కాషాయరంగు పైన ఉండేటట్లు, నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి. మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు. రెండు జాతీయపతాకాలను ఎక్స్ ఆకారంలో కర్రలకు తగిలించినట్లైతే రెండు జెండాలూ వ్యతిరేకదిశల్లో తగిలించాలి. పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.వీరి ఆదేశాల మేరకు..రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేస్తారు. అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం చేసే ముందు తీసేయాలి. శవంతో పాటు సమాధిలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.ఇవి తప్పనిసరి..ఇతర దేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసే సమయంలో వరుసలో మొదటి స్థానంలో కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లి‹Ùలో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలి. వృత్తాకారంలో ఎగరేసినప్పుడు భారత పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. మన పతాకాన్ని ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి. పతాకాన్ని సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. వక్తలు ఉపన్యసించేచోట ఉన్నట్లైతే వారికి కుడిచేతి వైపునే ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకెళ్ళే సమయంలో మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్లేటప్పుడు కుడివైపున మొదటిదిగా లేదా మధ్యలో అన్నిటికంటే ముందు ఉండాలి. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా జాతీయ జెండాను కిందికి దించరాదు.వాహనాలపై..జాతీయపతాకాన్ని వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్ల అధ్యక్షులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు భారత జాతీయపతాకం కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి. -
నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన దేశభక్తిని చాటుకున్నారు. కింద ఉంచిన జాతీయ జెండాను గమనించి అప్రమత్తయ్యారు ఆయన. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా.. ఇవాళ హాజరైన నేతలతో ఓ ఫొటోషూట్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వేదిక ఎక్కబోయారు. తమకు కేటాయించిన స్థానాల్లో నిల్చుని ఫొటోలు దిగాల్సి ఉంది. అయితే.. అక్కడ నేతలు ఎవరెక్కడ నిల్చోవాలనే గుర్తు కోసం ఆయా నేతలకు సంబంధించిన దేశాల జెండాల పేపర్ పీస్‌లను ఉంచారు. PM Narendra #Modi notices the Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at #BRICS, makes sure to not step on it, picks it up, and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit.#ModiInBRICS pic.twitter.com/pXCypilo4H — அகத்தியன் (@riverinerabbit) August 23, 2023 ఈ క్రమంలో వేదిక ఎక్కబోతూ.. అక్కడ జెండాను గమనించిన మోదీ.. దానిని తీసుకుని తన జాకెట్ జేబులో పెట్టుకున్నారు. మరోవైపు అప్పటికే తమ దేశపు జెండాపై అడుగేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. మోదీ చర్యను గమనించి అక్కడే ఉన్న సిబ్బందికి ఆ జెండాను అందించారు. -
ఖలీస్తానీ మద్ధతుదారుల దుశ్చర్య.. భారత్ కౌంటర్
లండన్‌లోని భారత హైకమిషనర్ వద్ద ఆదివారం జరిగిన పరిణామాలకు భారత్ తక్షణ కౌంటర్ ఇచ్చింది. పంజాబ్‌లో ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్‌కు నిరసనగా.. లండన్ హైకమిషనర్ ఆవరణలో భారత జాతీయ జెండాను ఖలీస్తానీ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగేయాలని యత్నించడం.. ఆ వెంటనే అధికారులు స్పందించడం, తదనంతరం భారీ జాతీయ జెండాను ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్ అల్డివిచ్ ఇండియా హౌజ్ బయట ఈ భారీ భారతీయ జాతీయ జెండాను ఎగరేయగా.. పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఈ పరిణామంపై ఝండా ఊంచా రహే హమారా అంటూ ట్విటర్లో పోస్ట్ ఉంచారు. భారత జెండాను అవమానించేలా వ్యవహరించిన వాళ్లపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంరక్షణకు, పలు రకాల సేవలు అందించిన ఖ్యాతి పంజాబ్‌కు, పంజాబీలకు ఉందని పేర్కొన్నారు ఆయన. “Jhanda Ooncha Rahe Hamara”- UK Govt must act against those miscreants who attempted to disrespect Indian Flag at High Commission,London.Punjab & Punjabis have a glorious track record of serving/protecting the Nation.Handful of jumping jacks sitting in UK do not represent Punjab. pic.twitter.com/TJrNAZcdmf — Jaiveer Shergill (@JaiveerShergill) March 20, 2023 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను కిందకు లాగేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో భారత హైకమిషనర్ అధికారులు తక్షణం స్పందించారు. కౌంటర్‌గా ఖలీస్తానీ జెండాను విసిరేయడంపై.. పలువురు నెటిజన్స్ ప్రశసంలు గుప్పిస్తున్నారు. ఇక ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆదివారం అర్ధరాత్రి భారత్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టియానా స్కాట్‌కు ఈ ఘటనపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు యూకే మంత్రి తారీఖ్ అహ్మద్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు. Salute to the Brave Indian High Commission Official 🙏🇮🇳 He not only took back the Indian flag but stopped the extremist from installing the K-Flag.#UK #London pic.twitter.com/4X0DJQo9hV — Megh Updates 🚨™ (@MeghUpdates) March 19, 2023 ఇదీ చదవండి: ఒకేసారి.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం -
‘ప్రధాని మోదీ వల్లే అది సాధ్యమైంది’
న్యూఢిల్లీ: ఆదివారం జమ్ము కశ్మీర్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగరేశారు ఆ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ. అయితే.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే రాహుల్ గాంధీ అలా జెండా ఎగరేయడం సాధ్యమైందని బీజేపీ ఎంపీ రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ‘అసలు రాహుల్ గాంధీ అంత ప్రశాంతంగా లాల్ చౌక్‌లో జెండా ఎలా ఎగరేయగలిగారు? ఆ పరిస్థితులకు కారణం ఆర్టికల్ 370 రద్దు కావడం. అది చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ గడ్డపై ఉగ్రవాదం, ప్రజల భయాందోళనలు మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడ శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. అధిక సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు అని రవిశంకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోడ్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ గర్వంగా జాతీయ జెండాను ఎగరేశారు. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొనడానికి కారణం ప్రధాని మోదీ అని ఉద్ఘాటించారు. జమ్ము కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాత్రం ఆ క్రెడిట్‌ను ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షాకు సైతం దక్కుతుందని పేర్కొన్నారు. ఏడు వసంతాల తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనగర్ లాల్ చౌక్‌లో జెండా ఎగరేశాడు. ఈ ప్రాంతంలో ప్రశాంతత, సోదర భావం పెంపొందడానికి మోదీ, షాలే ముఖ్యకారకులు అని రైనా పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేటితో భారత్ జోడో యాత్రకు ముగింపు -
భారత జెండాతో ఆఫ్రిది కూతురు.. నిజమేనన్న పాక్ మాజీ ఆల్‌రౌండర్
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య జరిగిన సూపర్-4 దశ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది చిన్ని కూతురు భారత జెండా ఊపుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ విషయమై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అఫ్రిదిని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. ఈ విషయంపై లైవ్‌లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అఫ్రిది పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును నా కూతురు భారత జెండా పట్టుకుంది.. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆ రోజు (భారత్-పాక్ మ్యాచ్ జరిగిన రోజు) స్టేడియంలో 90 శాతం మంది భారత అభిమానులు, కేవలం 10 శాతం మంది పాక్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేడియం వద్ద పాక్ జాతీయ జెండాలు దొరక్కపోవడంతో మా పాప భారత జెండాను పట్టుకుంది. ఫైనల్లో పాక్‌పై శ్రీలంక గెలిచిన అనంతరం గంభీర్ కూడా శ్రీలంక జెండా ఊపాడు. అలా చేసినంత మాత్రనా అతను శ్రీలంకన్ అయిపోయాడా.. లేక అతన్ని శ్రీలంక అభిమాని అని అనాలా..? అంటూ ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని జర్నలిస్ట్‌ను కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు రెండు సందర్భాల్లో ఎదురెదురు పడగా.. గ్రూప్ దశలో టీమిండియా, సూపర్-4 దశలో పాక్‌లు గెలుపొందాయి. సూపర్-4 దశలో భారత్.. పాక్, శ్రీలంక చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఫైనల్లో శ్రీలంక, పాక్‌లు తలపడగా.. లంకేయులు పాక్‌ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు. -
జాతీయ జెండాను ముట్టుకోని జై షా.. కారణం ఇదేనా..!
ఆసియా కప్ 2022లో భాగంగా నిన్న (ఆగస్ట్ 28) దాయాది పాక్‌తో జరిగిన హైఓల్టేజీ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన.. పాక్‌ను మట్టికరిపించిన అనంతరం స్టేడియంలో తారసపడిన ఓ ఆసక్తికర పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Why son of India's Home Minister not accepting the National flag? pic.twitter.com/ZSB0P56iLV — Maharashtra Congress (@INCMaharashtra) August 28, 2022 మ్యాచ్ చూసేందుకు వచ్చిన బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా వ్యవహరించిన తీరు అతని తండ్రి ప్రత్యర్ధులకు ఆయుధంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరకాల ప్రత్యర్ధితో నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా విజయానంతరం సంబురాలు అంబరాన్నంటాయి. స్టేడియంలోని ప్రేక్షకులు జాతీయ జెండాలు చేతబూని, సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ భారత దేశ ఖ్యాతి విశ్వమంతా తెలిసేలా ఎలుగెత్తి చాటారు. India Vs Pakistan Match highlights !! 🔥 Amith shah son Jay Shah just rejected India flag… 🔥Why Amit Shah's son Jay Shah doesn't want to celebrate India's win with the tricolour. Is he allergic towards Indian Flag?#IndiaVsPakistan #jayshah pic.twitter.com/I5ZrWGgtqp — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 28, 2022 ఈ క్రమంలో స్టేడియంలోనే ఉన్న జై షాకు ఓ అభిమాని త్రివర్ణ పతాకాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇందుకు జై షా నిరాకరిస్తూనే.. చప్పట్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించాడు. జై షా ఇలా ప్రవర్తించడం ప్రతి భారత అభిమానికి అగ్రహం తెప్పించింది. జై షా వ్యవహరించిన తీరును అతని తండ్రి ప్రత్యర్ధులు ఏకి పారేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి తనయుడి దేశ భక్తి ఇదేనా అంటూ మాటల తూటాలు సంధిస్తున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. Because he is president of Asian Cricket Council. And as per code of conduct, he has to show neutrality against all stake holders. https://t.co/3SuIl2lj4i — Facts (@BefittingFacts) August 29, 2022 అసలు కారణం ఇది! అయితే జై షా విమర్శించడాన్ని ఆయన ఆప్తులు మాత్రం తప్పుపడుతున్నారు. విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. జై షా కేవలం బీసీసీఐ సెక్రటరీ మాత్రమే కాదని.. ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధ్యక్షుడు అన్న విషయం తెలుసుకుని మాట్లాడాలని.. కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని కొందరు మాత్రం జై షాను, ఆయన తండ్రిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. చదవండి: గంభీర్‌ను ఎవరూ ఇష్టపడే వారు కాదన్న అఫ్రిది.. భజ్జీ రియాక్షన్‌పై ఫ్యాన్స్ ఫైర్ -
భారత్‌కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
India celebrates its Independence Day not world But Space Well: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్ వ్యోమోగామి రాజా చారి ట్విట్టర్లో విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. రాజా చారి ఇటీవల ఐఎస్ఎస్లో ఆరునెలల మిషన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ చేసిన స్పేఎక్స్ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమోగాములలో అతను కూడా ఉన్నారు. ఈ మేరకు చారి ట్విట్టర్లో.... " భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటునమ్నాను. వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతుంది. యూఎస్‌లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్‌కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుంది. తాను యూఎస్‌లోని ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్ నగర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రోఫెసర్‌గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత చారీ అక్కడే యూఎస్‌లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో జన్మించాడు. అయోవాలోని వాటర్లూలో కొలంబస్ హై స్కూల్ నుంచి ప్రాధమిక విద్యను, కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశడు. ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజా చారి 2017లో వ్యోమోగామిగా ఎంపికయ్యాడు. On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6 — Raja Chari (@Astro_Raja) August 14, 2022 (చదవండి: భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్‌కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఆహారధాన్యాలు కావాలంటే జెండా కొనండి. లేదంటే వెళ్లండి’ అంటూ హరియాణాలోని కర్నాల్‌లో ఒక రేషన్ షాప్ డీలర్ కరాఖండీగా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జాతీయతను బీజేపీ అమ్మకానికి పెట్టింది. పేదల ఆత్మాభిమాన్ని గాయపరిచింది’ అని బీజేపీ సర్కార్‌ను విమర్శిస్తూ రాహుల్ ఫేస్బుక్లో పోస్ట్‌పెట్టారు. Forced To Buy Flag To Get Ration, Allege Haryana Villagers https://t.co/QMuJIrA4I9 pic.twitter.com/M50XBXhQnX — NDTV (@ndtv) August 10, 2022 వరుణ్ గాంధీ ఆగ్రహం ‘75వ స్వాతంత్య్రదినోత్సవాల వేళ ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. చౌక సరకుల కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడే పేద ప్రజల కష్టార్జితాన్ని ఇలా చిల్లరగా వసూలుచేయడం దారుణం. త్రివర్ణ పతాకానికి వెల కట్టడం శోచనీయం’ అని వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో జాతీయ పండుగ పేదలకు భారంగా మారిందన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలంతా తమ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెల్సిందే. దీని అవకాశంగా తీసుకుని రేషన్ షాపుల వద్ద జెండాల వ్యాపారం చేయిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. చదవండి: (ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా) -
పింగళి 146వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ (ఫోటోలు)
-
‘హర్ ఘర్ తిరంగ’పై జవాన్ల సందేశం..12వేల అడుగుల ఎత్తుకు వెళ్లి మరీ..
లద్దాఖ్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు పిలుపునిచ్చింది కేంద్రం. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని కోరారు ఐటీబీపీ జవాన్లు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరిహద్దుల్లో 12వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు పలువురు జవాన్లు. ఆ వీడియోను సరిహద్దు గస్తి దళం ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో.. లద్దాఖ్‌లోని లేహ్‌లో భూమి నుంచి 12వేల అడుగుల ఎత్తున ఉన్న కొండ చివరి భాగంలో పలువురు జవాన్లు కూర్చుని ఉన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘భారత్ మాతాకి జై. లద్దాఖ్‌లో 12వేల అడుగుల ఎత్తున ఐటీబీపీ దళాలు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి. 2022, ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నాం.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చింది ఐటీబీపీ. भारत माता की जय ! ITBP troops with Tricolour at 12 K feet in Ladakh with the message of 'Har Ghar Tiranga' to urge the citizens to hoist the Tricolour or display it in the homes between 13 to 15 August, 2022.#HarGharTiranga #AzadiKaAmrtiMohotsav pic.twitter.com/NpvS5coZY7 — ITBP (@ITBP_official) July 27, 2022 భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న క్రమంలో హర్ ఘర్ తిరంగా చేపట్టాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. దానికి తగినట్లుగా ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేసింది. వారంలో రోజంతా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలు కల్పించింది. అలాగే.. జెండా తయారీకి ఉపయోగించే సామగ్రి, సైజ్‌లపై ఉన్న నియంత్రణలను సైతం ఎత్తివేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తోన్న హర్ ఘర్ తిరంగలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల జెండాలు ఎగురవేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈడీ పోలీస్ విభాగం కాదు.. అయినా అరెస్టులు సరైనవే: సుప్రీం కోర్టు -
భారత జెండాను టచ్ చేయని రష్యా.. కారణం ఇదే!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధ ప్రభావం ఉక్రెయిన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్ బాసటగా నిలవడంతో పాటు రష్యాపై ఆంక్షల విధిస్తున్నాయి. అయితే.. భారత్ మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత అనుసరిస్తున్న తీరపై రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. తాజాగా రష్యాతో భారత్‌కి ఉన్న స్నేహబంధం ఎలాంటిదో నిరూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరు మారలేదని కొన్ని దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా రష్యా తాను చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగాలకూ పలు దేశాలను సహాయం అందించకూడదనే ఆలోచనలో ఉంది. అంతేకాదు వన్‌వెబ్ రాకెట్‌పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. బైకనోర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించాల్సిన స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగస్వామ్యంతో 36 వన్ వెబ్ శాటిలైట్లను ప్రయోగించనున్నారు. అయితే, ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిటన్, జపాన్ జెండాలను తొలగించిన రష్యా.. భారత్ జెండాను మాత్రం అలాగే, ఉంచింది. అంతేకాకుండా రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విషయంపై స్పందిస్తూ.. “కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మందుకంటే అందంగా ఉందని తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Стартовики на Байконуре решили, что без флагов некоторых стран наша ракета будет краше выглядеть. pic.twitter.com/jG1ohimNuX — РОГОЗИН (@Rogozin) March 2, 2022 -
ఉక్రెయిన్‌లో పాకిస్తాన్ విద్యార్థులను కాపాడిన భారత జెండా!
భారత జాతీయ పతాకం పాకిస్థాన్ పౌరులకు అండగా నిలిచింది. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు బాసట అయ్యింది. కొందరు టర్కీ విద్యార్థులు కూడా త్రివర్ణ పతాకం సాయంతోనే ఉక్రెయిన్ సరిహద్దులు దాటగలిగారు. ఆపరేషన్ గంగలో భాగంగా భారత్ చేరుకున్న విద్యార్థులు ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు వేలమంది ప్రయత్నిస్తున్నారు. భారత్ మినహా మరే దేశమూ తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇతర దేశస్థులు కూడా మన జెండానే నమ్ముకుంటున్నారు. పాకిస్థాన్, టర్కీకి చెందిన కొందరు విద్యార్థులు భారత్ జెండాను ప్రదర్శించడం ద్వారా.. ఉక్రెయిన్ సరిహద్దులను సురక్షితంగా దాటగలిగారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వాయుసేన రవాణా విమానాలతోపాటు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం అందుకునేందుకు రొమేనియాలోని బుచారెస్ట్కు కొందరు భారత విద్యార్థులు చేరుకున్నారు. భారత జెండాలను పట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను వారు పాటించారు. మన జెండాను చూపించి ఉక్రెయిన్ సరిహద్దును దాటడం తమకు సులువైందని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే, తమను చూసిన కొందరు పాకిస్థాన్, టర్కీ విద్యార్థులు కూడా భారత జాతీయ జెండాను చేతబూని సరిహద్దులను దాటారని వివరించాడు. ఆపరేషన్ గంగలో భాగంగా బుధవారం 4 ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో మొత్తం 798మంది విద్యార్థులు భారత్ చేరుకున్నారు. గురువారం బుకారెస్ట్ నుంచి 8, బుడపెస్ట్ నుంచి 5, జెస్‌జోవ్ నుంచి 3, సుసీవా నుంచి 2, కోసిస్ నుంచి ఒక విమానం ఢిల్లీకి చేరుకున్నాయి. వీటిలో మొత్తం 3726మంది భారతీయ విద్యార్థులు. పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. #WATCH | "We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray...Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students," said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisis pic.twitter.com/vag59CcPVf — ANI (@ANI) March 2, 2022 -
Apple: ఏంది యాపిల్ ఇది.. భారత్ అంటే లెక్కేలేదా?
Anupam Kher On Apple: యాపిల్ ఉత్పత్తుల పట్ల భారతీయులకు యమ క్రేజు ఉంటుంది. పైగా ఆ ప్రొడక్టుల కొనుగోళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్ అని తెలిసిన విషయమే కదా. అందుకే తాజాగా జరిగిన అతిపెద్ద ఈవెంట్‌ను భారత్ నుంచే ఎక్కువ మంది లైవ్‌లో వీక్షించారు. అయితే యాపిల్ మాత్రం భారత్ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. నటుడు అనుపమ్ ఖేర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలోని యాపిల్ స్టోర్‌ను మొన్న మంగళవారం ఆయన సందర్శించారట. అక్కడ ఒలింపిక్స్ కలెక్షన్ పేరుతో కొన్ని వాచీలను డిస్ప్లే ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత్ జెండా కనిపించకపోయే సరికి ఆయన చిన్నబుచ్చుకున్నారు. ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. స్మార్ట్ వాచీ కలెక్షన్ బాగుంది. కెనెడా, ఆసీస్, ఫ్రాన్స్.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్ ఉంచారు. కానీ, అందులో భారత్ జెండా మాత్రం లేదు. ఈ విషయంలో నిరాశ చెందాను.. కారణం ఏమై ఉంటుంది? యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించేవాళ్లు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు కదా! మరి మా జెండా కనిపించలేదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే యాపిల్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి! Dear @Apple! Visited your store on 5th ave in NY! Impressive! There were watches of International Olympic collection representing flags of various countries! Was disappointed not to see INDIA’s watch there? I wonder why? We are one of the largest consumers of #Apple products!😳🇮🇳 pic.twitter.com/IVvB8TmkGU — Anupam Kher (@AnupamPKher) September 14, 2021 చదవండి: ఐఫోన్ 13 లాంఛ్.. ఊహించని ట్విస్ట్ -
జాతీయ జెండా విలువేంటో తెలుసా?
జాతీయ జెండా అంటే.. ప్రతీ దేశానికి ఒక గుర్తింపు. మన మువ్వెన్నెల జెండా.. జాతి ఔనత్యానికి ప్రతీక. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వీరుల త్యాగానికి ప్రతీకల్లో ఒకటి. అందుకే జాతీయ పతాకాన్ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత కూడా. పంద్రాగష్టు, గణతంత్ర దినోత్సవాలప్పుడు ఉప్పొంగే దేశభక్తి.. జెండాను గుండెలపైకి చేరుస్తుంది. కానీ, ఈరోజుల్లో అయినా జాతీయ జెండాకు నిజమైన గౌరవం అందుతోందా? అని వజ్రోత్సవాల వేడుకల(75వ) సందర్భంగా సోషల్‌మీడియా #RespectNationalFlag హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నిస్తోంది. ఎవరైనా, ఎప్పుడైనా గౌరవానికి భంగం కలగని రీతిలో జాతీయ జెండా(National flag)ను ఎగరేయవచ్చు. 2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు. కానీ, 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్‌ను మార్చింది. మిగిలిన రోజుల్లోనూ జెండాను అవమానం కలగకుండా.. పగటి పూట ఎగరేయవచ్చని స్పష్టం చేసింది. Vande Mataram 🇮🇳 pic.twitter.com/xGsfMMKat3 — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) August 14, 2021 దేశ పండుగల నాడు జెండాను గౌరవించుకోవాలనుకోవడం మంచిదే!. కానీ, ఆ వంకతో రంగుల్ని ప్రదర్శించడం ఎంత వరకు సమంజసం. జెండా అంటే పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు. డ్రస్సుల్లో, ముఖానికి రంగులుగా పులుముకోవడం, వాట్సాప్, ఫేస్బుక్కుల్లో ప్రచారం కోసం జెండాపై రాతలు, ఫొటోలతో నింపడం అపవిత్రం చేసినట్లే అవుతుంది. జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ ఈ-కామర్స్ సైట్లపై అగ్గిమీద గుగ్గిలం అయ్యేవాళ్లకు.. జాతీయ జెండాను అవమానించడమూ నాన్-బెయిలబుల్ నేరం అని తెలుసో లేదో. జెండాను తిరగేసి ఎగరేయడం, కింద పడుకోబెట్టడం లాంటివి చేస్తే చట్టం సహించదు కూడా. #RespectNationalFlag pic.twitter.com/dq5Ry8gu3O — Brahmaiah (@Brahmai45382593) August 15, 2021 “Our flag does not fly because the wind moves it, it flies with the last breath of each soldier who died protecting it.” Happy Independence day to everyone...#IndiaAt75 #IndependenceDay #15August #स्वतंत्रतादिवस #RespectNationalFlag #AmritMahotsav pic.twitter.com/J6s5nozDsq — Faizal Peraje 🇮🇳 (@Faizal_Peraje) August 15, 2021 జెండా ఎగరేసే ఆత్రుతలో, నిర్లక్క్ష్యంతో ఉల్టా-పల్టా ఎగరేసి అవమానించేవాళ్లు ఎలాగూ ఉంటారు. అది వాళ్ల విచక్షణకే వదిలేద్దాం. కానీ, కమర్షియల్ మార్కెటింగ్, ప్రచారాల కోసం జెండాను ఉపయోగించుకునేవాళ్లు, జెండాలను రోడ్డున పడేసే వాళ్ల సంగతి ఏంటి?. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరూ అతీతులు కాదు.. అంతా జాతీయ పతాకాన్ని-గేయాన్ని గౌరవించి తీరాల్సిందే. పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ విషయంలో పాఠాలు చెబితే బాగుండు. జై హింద్. -ట్విటర్లో ఉవ్వెత్తున ఎగసిన #RespectNationalFlag -
ఔరా అనిపిస్తున్న గుండు సూదిపై రాకెట్..
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక హస్తకళలో రాష్ట్రపతి అవార్డు పొందిన శ్రీశైలపు చిన్నయాచారి గుండు సూదిపై జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్ నమూనాను అమర్చి ఔరా అనిపించారు. శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్‌ను స్ఫూర్తిగా తీసుకొని మైక్రో ఆర్టుతో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు. గుండు సూది పైభాగంలో బంగారంతో 5 మిల్లీమీటర్ల ఎత్తు, 1.5 మిల్లీమీటర్ల వెడల్పుతో రూపొందించారు. రాకెట్ చివరి భాగంలో భారతదేశం జెండా ఏర్పాటు చేశారు. రాకెట్‌ను తయారుచేయడానికి రెండు రోజుల సమయం పట్టిందన్నారు. అప్డేట్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)-ఎఫ్10 వాహకనౌక ప్రయోగం విఫలమైంది. -
యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన సమయంలో ప్రవాస భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విన్సెంట్ జావియర్ పాలతింగాల్ (54) ట్రంప్ మద్దతుదారులతో కలిసి మన జాతీయ జెండాని ప్రదర్శించాల్సిన అవసరమేమొచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ విన్సెంట్ మాత్రం తన చర్యని పూర్తిగా సమర్థించుకుంటున్నారు. పలు మీడియా సంస్థలు ఫోన్ ద్వారా ఆయనని ఇంటర్వ్యూ చేసిన సమయంలో అడిగిన ప్రశ్నలకు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చారు. (యూఎస్‌లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం) అందరూ భావిస్తున్న ట్టుగా ట్రంప్ మద్దతుదారులందరూ మూర్ఖులు కాదని నిరూపిం చడానికే తాను జెండా పట్టుకొని వెళ్లానని అంటున్నారు. ‘సాధారణంగా ఎవరైనా నిరసన ప్రదర్శనలకి వెళితే తమ జాతీయ జెండానే మోసుకెళ్తారు. ట్రంప్‌కి ఇప్పటికీ అంతర్జాతీయంగా మద్దతు ఉంది. ఎందరో భారతీయులు ఆయన అభిమానులుగా ఉన్నారు’’ అని విన్సెంట్ చెప్పారు. ట్రంప్ మద్దతుదారులు అందరూ శాంతియుతంగానే నిరసన ప్రదర్శన నిర్వహించారని, కానీ ఆయన ప్రతిష్టని దిగజార్చడానికి 50 మంది వరకు లెఫ్టిస్టులు నిరసన కారుల్లో కలిసిపోయి బీభత్స కాండ సృష్టించారని ఆరోపించారని విన్సెంట్ అడ్డగోలు వాదనలు చేశారు. వామపక్షాలంటే ద్వేషం : విన్సెంట్ స్నేహితులు విన్సెంట్ జేవియర్ భారత్‌లో ఉండగా కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారని ఆయన స్పేహితులు చెప్పారు. లెఫ్ట్ పార్టీల పట్ల తీవ్ర ద్వేషభావం ఉండేది. రాజకీయ కారణాలతోనే ఆయన దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారని, సాఫ్ట్వేర్ సంస్థని నెలకొల్పి ఆ దేశంలోనే స్థిరపడిపోయారని విన్సెంట్ స్నేహితులు వివరించారు. అమెరికా వెళ్లాక కూడా ఆయన కొన్ని మళయాళీ సంస్థల్లో చురుగ్గా ఉంటూ ట్రంప్ మద్దతుదారుడిగా ఉన్నారు. మువ్వన్నెల జెండా పట్టుకొని నిరసనకు వెళ్లడంతో భారతీయుల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో జెండా పట్టుకొని ఉన్న ఫోటోలను తొలగించారు. -
క్యాపిటల్ హిల్ ఘటన: ‘అక్కడ మన జెండా ఎందుకుంది?’
వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇక దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలువురు దేశాధినేతలు ఈ ఘటనను ఖండించారు. ఇక నిరసనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్యక్తి భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని కనిపించడం గమనార్హం. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏ పార్టీకి చెందినవాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ అమెరికా ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసన కార్యక్రమంలో త్రివర్ణపతాకం కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.(చదవండి: బైడెన్ గెలుపును ధ్రువీకరించిన కాంగ్రెస్) ‘ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మన జెండా ఎందుకుంది... ఇలాంటి చోట మన మద్దతు అనవసరం అంటున్నారు’ నెటిజనులు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా దీని మీద స్పందించారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. అక్కడ మన జెండా ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. ఈ పోరాటంలో మనం పాలుపంచుకోవాల్సిన అవసరం అసలే లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో ఈ రోజు జరగిన నిరసనకు సంబంధించిందా.. లేక పాత వీడియోని ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేశారా అనేది ప్రస్తుతానికి తెలియలేదు. ఇక అమెరికా కాంగ్రెస్ బైడెన్‌ని అధ్యక్షుడిగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. -
కరీంనగర్ కీర్తి ‘పతాకం’
సాక్షి, కరీంనగర్ : జాతీయ పతాక రెపరెపలు చూస్తుంటే ప్రతి భారతీయుడి మది పులకిస్తుంది. పంద్రాగస్టు, చబ్బీస్ జనవరి రోజు వాడవాడలా జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేస్తే గర్వం గా ఉంటుంది. నిత్యం 150 ఫీట్ల ఎత్తులో జాతీయ జెండాలోని మువ్వన్నెలు కళ్లముందు రెపరెపలాడుతుంటే మేరా భారత్ మహాన్ అంటూ చె య్యేత్తి జైకొట్టాలనిపిస్తుంది. రాష్ట్రంలోనే రెండవ, దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ జెండా కరీంనగర్ నడిబొడ్డున ఆవిస్కృతమైతే సంతోషం కట్టలు తెంచుకుంటుంది. ఇంతటి మహాత్తర కార్యక్రమానికి మల్టీపర్పస్ స్కూల్ మైదానం వేదికైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండా రెపరెపలాడనుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 ఫీట్ల మహా జాతీయజెండాను శుక్రవారం ఆవిష్కరించనున్నారు. స్మార్ట్‌సిటీగా అవతరించిన కరీంనగర్‌పై నగర ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నా రు. సుందరమైన రోడ్లు, ఇబ్బందిలేని మురుగునీటి వ్యవస్థ, ప్రజలకు సరిపడా తాగునీటి వ్యవస్థలాంటి మౌలిక సదుపాయాలతో పాటు నగరానికి ప్రత్యేకతగా నిలిచే కార్యక్రమాలపై బల్దియా దృష్టిపెట్టింది. ఈక్రమంలో కర్ణాటక, హైదరాబాద్ తర్వాత అత్యంత ఎత్తైన జాతీయజెండాను ఏర్పాటుచేసి కరీంనగర్‌కు ఐకాన్‌గా మార్చేందుకు మేయర్ రవీందర్‌సింగ్ జెండా ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిద్ధం చేశారు. ‘స్మార్ట్’ పనులు ప్రారంభం.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద చేపట్టనున్న మల్టీపర్పస్‌స్కూల్, సర్కస్‌గ్రౌండ్ మైదానాల్లో పార్కుల ఏర్పాటుకు అంకురార్పణ జరగనుంది. దేశంలోనే అత్యంత సుందరమైన పార్కుగా మల్టీపర్పస్ గ్రౌండ్‌ను తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రూ. 7.20 కోట్ల నిధులు కేటాయించారు. అదే విధంగా సర్కస్‌గ్రౌండ్‌లో పార్కు నిర్మాణానికి రూ.3.80 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు టెక్నికల్ కమిటీ ఆమోదం తెలుపడంతో శుక్రవారం పనులు ప్రారంభించనున్నారు. జెండావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి : మేయర్ ప్రజలు కొంతకాలంగా ఎదురుచూస్తున్న అతిపెద్ద జాతీయజెండా శుక్రవారం రెపరెపలాడనుందని నగర మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. జెండాను ఎంపీ వినోద్‌కుమార్ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీచైర్ పర్సన్ తుల ఉమ, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, మున్సిపల్ కమిషనర్ స త్యనారాయణ హాజరవుతారని పేర్కొన్నారు. నగరంలోని అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, నగర ప్రజలు వేడుకలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
హాకీ ప్రపంచకప్ నిర్వాహాకులపై ఫ్యాన్స్ ఫైర్
లండన్ : మహిళల హాకీ ప్రపంచకప్ టోర్నీ నిర్వాహకులపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్ వేదికగా శనివారం నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగే ఈ టోర్నీలో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ జట్టు పాల్గొంటుంది. అయితే ఈ టోర్నీకి ముందు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నిర్వాహకులు ఘోర తప్పిదం చేశారు. భారత జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని మరిచారు. దీంతో అభిమానులు టోర్నీ నిర్వహకులపై మండిపడుతున్నారు. టోర్నీ ప్రచారంలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫొటోషూట్‌లో 16 దేశాలకు చెందిన కెప్టెన్లు పాల్గొన్నారు. మిగతా సారథులతో కలిసి భారత కెప్టెన్ రాణి సైతం ఫొటోషూట్‌కు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయా కెప్టెన్లు తమ దేశానికి సంబంధించిన జాతీయ పతాకాల పక్కన నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే, నిర్వాహకులు భారత జాతీయ పతాకంలో అశోకచక్రాన్ని ఉంచడం మరిచారు. మన జాతీయ పతాకం పక్కన రాణి రాంపాల్ నిల్చున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి తప్పులు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇక పూల్-బిలో చోటు దక్కించుకున్న భారత్ శనివారం తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో తలపడనుంది. Ashok Chakra missing from the Indian flag. Is it a mistake or done intentionally? — Nilesh Tandon (@nileshtandon) July 19, 2018 -
మోదీకి నిరసన సెగ.. జాతీయ జెండాకు అవమానం
లండన్ : ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భారత జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థాన్ ఆందోళనకారులు భారత జాతీయ జెండాను అవనతం చేసి.. చించి ఆపై తగలబెట్టారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో కామన్వెల్త్ దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (చోగమ్) జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు స్క్వేర్ వద్ద మొత్తం 53 కామన్వెల్త్ దేశాల జెండాలను అధికారులు ఎగుర వేశారు. అయితే మోదీ రాకను వ్యతిరేకిస్తూ పాక్ చెందిన మత గురువు అహ్మద్ నేతృత్వంలో యూకే సిక్కు ఫెడరేషన్‌కు చెందిన ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు, మోదీ వ్యతిరేక మైనారిటీల గ్రూప్‌కు చెందిన 500 మంది అక్కడికి ర్యాలీగా చేరుకున్నారు. తొలుత వీరంతా అక్కడి మహాత్మగాంధీ విగ్రహం వద్ద జెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఆపై జెండా కర్ర నుంచి భారతీయ పతాకాన్ని అవనతం చేసి చించేశారు. ఆపై దాన్ని కాల్చేసి.. అక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలిస్థాన్ జెండాలను ఎగురవేశారు. ఇదంతా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. లండన్ పోలీసుల తీరుపై విమర్శలు... ఈ ఘటన జరుగుతున్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ భారతీయ సీనియర్ జర్నలిస్ట్ చిత్రీకరించగా.. అతనిపై కూడా దాడి చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించిన లండన్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారతీయ జెండాను తొలగించిన దిమ్మె ఇదే భారత్ స్పందన... జాతీయ జెండాకు జరిగిన అవమానంపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జెండాను అవనతం చేసి చించేయడంపై బ్రిటిష్ అధికారులకు మా నిరసన తెలియజేశాం. ఆ ఘటనకు వారు క్షమాపణలు చెప్పారు. ఇటువంటి శక్తులు సమస్యలు సృష్టించవచ్చని ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం. చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇది చోటు చేసుకోవటం దురదృష్టకరం. ఆ స్థానంలో జాతీయ జెండాను కొత్తది ఏర్పాటు చేశారు’’ అని ప్రధానితోపాటు పర్యటిస్తున్న బృందంలోని అధికారి ఒకరు తెలిపారు. -
ధోని హెల్మెట్‌పై జెండా ఎందుకు ఉండదంటే..
సాక్షి స్పోర్ట్స్: భారత క్రికెట్ ఆటగాళ్లు ధరించే హెల్మెట్లు ఎప్పుడైనా పరీక్షగా చూశారా? చూసుంటే ఏమైనా కనిపెట్టారా? సచిన్, గంగూలీ, కోహ్లీ, ఇతర ప్రముఖ ఆటగాళ్లు అర్ధ సెంచరీ, సెంచరీలు చేసిన తర్వాత హెల్మెట్‌ను ముద్దాడం చూశారా? ధోని వారిలాగే ఎప్పుడైనా చేశాడా లేదా? వారందరూ ఎందుకు అలా చేస్తారో తెలుసా? తెలియక పోతే తెలుసుకోండి. వీటన్నింటికి సమాధానం ఒక్కటే.. అదే భారత జెండా. భారత క్రికెట్ ఆటగాళ్ల హెల్మెట్లపై బీసీసీఐ లోగోతో పాటు భారతీయ జెండా ఉంటుంది. దేశం మొత్తం గర్వంగా భావించే జాతీయ జెండాను ధరించడం ఎవరైనా గొప్ప గౌరవంగా భావిస్తారు. అందుచేతనే సచిన్, సెహ్వాగ్‌లతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు అందరూ సెంచరీ పూర్తి చేయగానే హెల్మెట్‌ను ముద్దాడతారు. కానీ ధోని మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాడు. అలా అని ధోనికి దేశభక్తి లేదని కాదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భారత కెప్టెన్‌గా అలా చేయకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971 కింద ధోని క్రికెట్ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే. దేశం మొత్తం తలెత్తి సెల్యూట్ చేయాల్సిన జెండాను నేలపై ఉంచితే, భారతదేశాన్ని అవమానపరిచినట్లే. కీపింగ్ చేస్తున్నప్పుడు ధోని కొన్ని సార్లు హెల్మెట్‌ను నేలపై ఉంచుతాడు. ఆ సమయంలో హెల్మెట్‌పై జెండా ఉంటే ధోని భారత దేశాన్ని అవమాన పరిచినట్లు అవుతుంది. ఈకారణంగానే ధోని హెల్మెట్‌పై భారత జెండా ఉండదు. 2011 వరకూ హెల్మెట్‌పై భారత జెండాను ధరించిన ధోని, ఆర్మీ లెఫ్టినెంట్‌గా గౌరవించబడినప్పటి నుంచి ధరించడంలేదు. ఇది దేశంపై ధోనికి ఉన్న గౌరవానికి చిన్న ఉదాహరణ మాత్రమే. -
భారతీయుల హృదయాలను గెలిచాడు
స్విట్జర్లాండ్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారతీయుల మనసు గెలిచారు. సెయింట్ మోరిట్జ్ ఐస్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా పాలెస్ డైమండ్స్, రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. ఈ సందర్భంగా రాయల్స్‌కు కెప్టెన్‌గా అఫ్రిది వ్యవహరించారు. రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించారు అఫ్రిది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తనకు ఓ ఫొటో ఇవ్వాలని అఫ్రిదిని భారతీయ ఫ్యాన్ కోరగా.. అందుకు స్పందించిన అఫ్రిది భారత జాతీయ పతాకాన్ని కూడా సరిగా పట్టుకోవాలని ఆమెను కోరారు. మ్యాచ్ సందర్భంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. భారత జెండా పట్ల అఫ్రిది చూపిన గౌరవానికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. -
గార్లలో దశమి రోజు జాతీయ జెండా
గార్ల(డోర్నకల్): మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విజయదశమి రోజు శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించను న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్ల మండల కేంద్రంలో నిజాం నవాబు కాలం నుంచి జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో స్థానిక మసీదు సెంటర్లో నిజాం అధికారిక జెండాను ఆవిష్కరించేవారు. నిజాం పాలన ముగిసిన తర్వాత 1952లో సదరు గద్దెపై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమ్యూనిస్టులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దెపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు జాతీయ జెండాను ఎగుర వేశారు. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మొదటి పౌరుడు అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. -
జాతీయ జెండాను అవమానించిన చైనా
అల్మోరా: భారత్, చైనాల సంబంధాలపై డోక్లాం వివాదం ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా మరో క్షమించరాని తప్పు చేసింది. సగటు భారతీయుడు గౌరవంగా చూసుకునే జాతీయ జెండాను బూట్ల డబ్బాలపై ముద్రించింది. ఈ దురదృష్టకర ఘటన ఉత్తరాఖండ్ అల్మోరాలో చోటు చేసుకుంది. చైనా నుంచి వచ్చిన బూట్ల డబ్బాలపై మన జాతీయ పతాకంలో ఉండే మూడు రంగులతో బొమ్మలు ఉన్నాయని స్థానిక దుకాణదారుడు పోలీసులను ఫిర్యాదు చేశారు. బూట్లను పంపిన పెట్టెల పైభాగంలో మూడు రంగుల జెండా, అడుగున మాండరిన్ భాషలో పదాలు రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డోక్లామ్ వివాదం నేపథ్యంలో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా చైనా మరో కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. కిరాణా దుకాణదారుడు చేసిన ఫిర్యాదు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) రేణుకా దేవి తెలిపారు. బూట్లను దుకాణదారుడికి సరఫరా చేసిన రుద్రపూర్‌లోని తమ్మన ట్రేడర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు ఉద్దమ్ సింగ్‌నగర్ ఎస్ఎస్పీ సదానంద్ దతే చెప్పారు. న్యూఢిల్లీలోని సరఫరాదారు నుంచి తెప్పించామని, ఎక్కడ ఉంటారనే విషయం తమకు తెలియదని ట్రేడర్స్ యాజమాన్యం చెప్పినట్లు ఎస్ఎస్పీ వివరించారు. త్వరలోనే న్యూఢిల్లీ సరఫరాదారును గుర్తించి ప్రశ్నిస్తామని వెల్లడించారు. -
భారత పతాకం రెపరెపలాడాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించాలని ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్ క్రీడా మైదానంలో జిల్లా నుంచి భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు, సీనియర్ బాల, బాలికల జట్లకు క్రీడా దుస్తుల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథి ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఈ నెల 9 నుంచి 11 వరకు సింగపూర్‌లో జరిగే ఏషియా ఫసిపిక్ టోర్నీలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగే సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రభాకర్, కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు.