భారతీయుల హృదయాలను గెలిచాడు | Shahid Afridi Wins Hearts of Indians in Ice Cricket | Sakshi
Sakshi News home page

భారతీయుల హృదయాలను గెలిచాడు

Published Sat, Feb 10 2018 5:37 PM | Last Updated on Sat, Feb 10 2018 8:38 PM

Shahid Afridi Wins Hearts of  Indians in Ice Cricket - Sakshi

భారత ఫ్యాన్‌తో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది

స్విట్జర్లాండ్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది భారతీయుల మనసు గెలిచారు. సెయింట్‌ మోరిట్జ్‌ ఐస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ సందర్భంగా పాలెస్‌ డైమండ్స్‌, రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. ఈ సందర్భంగా రాయల్స్‌కు కెప్టెన్‌గా అఫ్రిది వ్యవహరించారు.

రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించారు అఫ్రిది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తనకు ఓ ఫొటో ఇవ్వాలని అఫ్రిదిని భారతీయ ఫ్యాన్‌ కోరగా.. అందుకు స్పందించిన అఫ్రిది భారత జాతీయ పతాకాన్ని కూడా సరిగా పట్టుకోవాలని ఆమెను కోరారు.

మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. భారత జెండా పట్ల అఫ్రిది చూపిన గౌరవానికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement