భారతే ఫేవరెట్
లండన్: తాజా ఫామ్, జట్టు బలాబలాలను చూస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ‘ఒక పాకిస్తానీగా మా దేశం గెలవాలనే నేను కోరుకుంటాను.
కానీ ప్రస్తుత భారత జట్టు అన్ని అంశాల్లో పాక్‌కంటే మెరుగ్గా కనిపిస్తోంది. కోహ్లి నాయకత్వంలో జట్టు చాలా బాగా ఆడుతోంది. ఒకవేళ ఆరంభంలోనే కోహ్లిని అవుట్ చేయగలిగితే పాక్ కాస్త పైచేయి సాధించే అవకాశం ఉంది’ అని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. బుమ్రా బౌలింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆఫ్రిది... 90వ దశకంలో తమ బౌలర్లు అద్భుతంగా ఉపయోగించిన ‘పాకిస్తానీ యార్కర్లు’ బుమ్రా వేస్తున్నాడని అన్నాడు.