139 అడుగుల జాతీయ పతాకం
పాతపోస్టాఫీస్: భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 139వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పాతనగరం వాడవీధికి చెందిన స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగ్గా.. డాక్టర్ జహీర్ అహ్మద్, యువభారత్ ఫోర్స్ అధ్యక్షుడు మహ్మద్ సాదిక్ పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 139 అడుగుల జాతీయ పతాకంతో పాతనగరం వాడవీధి, లక్ష్మి టాకీస్ కూడలి, టౌన్ కొత్తరోడ్డు, కురుపాం మార్కెట్ మీదుగా సీమరాణి బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాదచారులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.